ధర్మ లోకం వేరు ..నా వరకు నేను కరెక్ట్ అనుకునే వ్యక్తిత్వం తనది. చూసే వాళ్ల దృష్టిలో త‌ను త‌ప్పుగా క‌నిపిస్తుంటాడు. ఇల్లు, ఫ్యాక్ట‌రీ, గొడ‌వ‌, ఇడ్లీ, సిగ‌రెట్‌, బీర్ ఇదే త‌న ప్ర‌పంచం. త‌న జీవితంలో ఇంట్రెస్టింగ్‌గా ఏదీ లేద‌ని అనుకునే ధ‌ర్మ జీవితంలో ఛార్లి అనే కుక్క ఎంట్రీ ఇస్తుంది.

ముందు ధ‌ర్మ‌కి ఛార్లి అంటే అస్స‌లు ప‌డ‌దు. దాన్ని ఎవ‌రికైనా ఇచ్చేయాల‌ని అనుకుంటూ ఉంటాడు. అలాంటి ధ‌ర్మ‌కి ఓసారి ఆప‌ద‌లో చిక్కుంటాడు. అప్పుడు ఛార్లి అత‌న్ని బ‌తికిస్తాడు. అప్పుడు ఛార్లి త‌న‌పై చూపించే ప్రేమ‌కు ధ‌ర్మ మ‌న‌సు క‌రిగిపోతుంది. ఇద్ద‌రి మ‌ధ్య అనుబంధం పెరుగుతుంది.

అలాంటి ఛార్లి, ధ‌ర్మ ఎందుకు కాశ్మీర్‌కి వెళ‌తారు. ఛార్లిని వెతుక్కుంటూ వెళ్లిన ధ‌ర్మ‌కు అక్క‌డ ఎదురైన ప‌రిస్థితులు ఏంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే జూన్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల‌వుతున్న ‘777 ఛార్లి’ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు మేకర్స్.

అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి నటించిన చిత్రం ‘777 ఛార్లి’ . ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తూ జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించారు. సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కుడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఛార్లి 777 చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.