శ్రీకాంత్ అయ్యంగార్, లోహిత్ కుమార్, మాస్టర్ భువన్ ప్రధాన పాత్రల్లో కిరణ్, ఇనయ సుల్తాన హీరో హీరోయిన్లుగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రమేష్ జక్కాల దర్శకత్వం లో లక్ష్మి ప్రసన్న భూమి నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం-1 చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం ఈరోజు ఫిలించాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన `మా` ఈసీ మెంబర్ విష్ణు బొప్పన తొలి షాట్ కి కెమెరా స్విచాన్ చేయగా యువ రైటర్ ప్రసన్న కుమార్ క్లాప్ నిచ్చారు. దర్శకుడు డైమండ్ రత్నబాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఆరంభ పూజ లో తోట ప్రసాద్, సాయి వెంకట్ స్క్రిప్ట్ అందజేశారు. అనంతరం అతిథులంతా చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ…“ఒక మంచి కథతో, మంచి టీమ్‌తో ప్రొడక్షన్ ప్రారంభించాం. దర్శకుడు పక్కా ప్లానింగ్ తో సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ చిత్రంలో మా అబ్బాయి మాస్టర్ భువన్ ఇంపార్టెంట్ క్యారక్టర్ లో నటిస్తున్నాడు. ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాను నిర్మించడానికి యూనిట్ అంతా కష్టపడుతున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్టైన్ చిత్రమిది. ఈ చిత్రం లో చాలా మంది నూతన కళాకారులను పరిచయం చేస్తున్నాం“ అన్నారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ…“సబ్జెక్ట్ చాలా నచ్చింది. ఒక మంచి సినిమాలో హీరోగా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
హీరోయిన్ ఇనయ సుల్తాన మాట్లాడుతూ…“హీరోయిన్ గా నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు“ అన్నారు.
నటుడు లోహిత్ కుమార్ మాట్లాడుతూ…“ ఈ చిత్రంలో నేను కీలక పాత్రలో నటిస్తున్నా. నా మీద నమ్మకంతో ఇంత మంచి క్యారక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు“ అన్నారు.
రైటర్ దాసరి వెంకటేష్ మాట్లాడుతూ…“నా మీద నమ్మకంతో రైటర్ గా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు“ అన్నారు.
దర్శకుడు రమేష్ జక్కాల మాట్లాడుతూ…“ఫోన్ లోనే సినిమా ఓకే చేశారు మా నిర్మాత. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మా నిర్మాతకు ధన్యవాదాలు. క్యారక్టర్ కి ఎవరైతే సరిపోతారో వారినే తీసుకుని ఈ సినిమా ప్రారంభించాం. శ్రీకాంత్ అయ్యంగార్, లోహిత్ కుమార్ గార్ల పాత్రలు సినిమాకు కీలకంగా ఉంటాయి. నవంబర్, డిసెంబర్ లో షూటింగ్ షెడ్యూల్ ఉంటుంది. అలాగే ఫిబ్రవరి కి రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాం“ అన్నారు.
కిరణ్, ఇనయ సుల్తాన , శ్రీకాంత్ అయ్యంగార్ , లోహిత్ కుమార్, వినోద్ కుమార్ ,సందీప్ , అశ్విని, వనిత, విక్రమ్, ముహ్మద్ భాషా మరియు మాస్టర్ భువన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంః మిహిరంష్; ఎడిటర్ః ఆర్ ఎమ్ విశ్వనాథ్ కుంచపల్లి, ఆర్ట్ డైరక్టర్ః రాజు అడ్డాల; కొరియోగ్రఫీః రామ్ ఇసుకపాటి; పీఆర్వోః రమేష్ చందు; ప్రొడక్షన్ డిజైనర్ః రామ్ మోహన్ అల్లూరి; నిర్మాతః ప్రసన్న లక్ష్మీ భూమి; స్ర్కీన్ ప్లే-దర్శకత్వంః రమేష్ జక్కాల.