నాని నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `అంటే సుందరానికి`. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు. ఈ సంద‌ర్భంగా మొదటి సింగిల్ పంచెకట్టును ఏప్రిల్ 6న సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో నాని, తన విదేశీ పర్యటన USAలోని సుందరమైన లొకేషన్‌లను ఆస్వాదిస్తూ, కారుడోర్‌లోంచి తల బయట పెట్టుకుని ఆశ్చ‌ర్యంగా పైకి చూస్తూ నవ్వుతూ కనిపించాడు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కాగా, ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్సాన్స్ వ‌చ్చింది.

నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది  ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు లీలా థామస్.

ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అంటే సుందరానికి జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: నాని, నజ్రియా ఫహద్, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ తదితరులు.

సాంకేతిక సిబ్బంది:

రచయిత, దర్శకుడు: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: నవీన్ యెర్నేని & రవిశంకర్ వై
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
CEO: చెర్రీ
మ్యూజిక్ కంపోజర్: వివేక్ సాగర్
సినిమాటోగ్రాఫర్: నికేత్ బొమ్మి
ఎడిటర్: రవితేజ గిరిజాల
ప్రొడక్షన్ డిజైన్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైన్: అనిల్ & భాను