దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన హన్సిక అనతికాలంలోనే అగ్రకథానాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది.ఆమె తెలుగులో నటిస్తున్న తొలి మహిళా ప్రధాన చిత్రం మై నేమ్ ఈజ్ శృతి ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు,నాగేంద్రరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఫిలింనగర్ దైవసన్నిధానంలో చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రేవతి క్లాప్‌నివ్వగా వైష్ణవి కెమెరా స్విఛాన్ చేశారు.తొలి సన్నివేశానికి వంశీ గౌరవ దర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో
హన్సిక మాట్లాడుతూ నేను కథానాయికగా నటిస్తున్న 52వ చిత్రమిది.తెలుగు సినిమాలతోనే కథానాయికగా నా ప్రయాణం ఆరంభమైంది.నటిగా టాలీవుడ్ నాకు మంచి పేరును తీసుకొచ్చింది. తెలుగులో మరో మంచి సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. స్వేచ్ఛస్వాతంత్ర్యాలు కలిగిన శృతి అనే యువతిగా ఈ సినిమాలో కనిపిస్తా.తన భావాల్ని ధైర్యంగా వెల్లడించే యువతిగా విభిన్నంగా నా పాత్ర ఉంటుంది.ఆద్యంతం మలుపులతో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది.కథ వింటున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందనే ముంగింపు వరకు నేను ఊహించలేకపోయాను.ఆ కొత్తదనం నచ్చే ఈ సినిమా అంగీకరించాను అని తెలిపింది.
నటుడు సాయితేజ మాట్లాడుతూ ఇది నా మూడో సినిమా. ఇందులో ఓ మంచి పాత్రను పోషిస్తున్నా.హన్సికకు జోడీగా కనిపిస్తాను అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ కొంత గ్యాప్ తర్వాత తెలుగులో హన్సిక నటిస్తున్న చిత్రమిది. తప్పకుండా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది.తర్వాత ఏం జరుగుతుందనే ప్రేక్షకుల ఊహకు అందదు.ఇలాంటి ట్విస్ట్‌లతో ఇప్పటివరకు వెండితెరపై సినిమా రాలేదు. నటన పరంగా లీడ్‌రోల్ చాలెంజింగ్‌గా ఉంటుంది.కథ విన్న తర్వాత ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా మంది భయపడ్డారు. హన్సిక ధైర్యంగా ఈ సినిమాను అంగీకరించింది అని అన్నారు
దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని చెబుతుంటారు.అలాగే ప్రతి మహిళ సంఘర్షణ వెనుక మగాడు ఉంటాడు. తన జీవితంలో ఎదురైన సంఘర్షణను ఓ యువతి ఎలా ఎదుర్కొన్నదన్నది ఈ చిత్ర ఇతివృత్తం.లాక్‌డౌన్ టైమ్ కావడంతో హన్సికకు జూమ్ యాప్ ద్వారా కథ చెప్పాలని అనుకున్నాం.కానీ ఆమె మాత్రం ముంబయి వచ్చి కథ చెప్పమని అన్నారు.హన్సిక ఇంట్లోనే ఆమెకు నాలుగున్నర గంటలు కథ చెప్పా.వెంటనే సినిమాను అంగీకరించింది. సోమవారం నుంచి తొలి షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నాం.ఈ నెలాఖరున సెకండ్ షెడ్యూల్, ఆగస్ట్‌లో మూడో షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం.నాలుగేళ్లుగా నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశాన్ని నిర్మాతలు ఇవ్వడం ఆనందంగా ఉంది అని చెప్పారు.
మురళీశర్మ, ఆర్ నారేయనన్, జయప్రకాష్, వినోదిని, సాయితేజ, పూజా రామచంద్రన్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కిశోర్ బోయిడపు,కళా దర్శకత్వం: గోవింద్,సంగీతం:మార్క్ కె రాబిన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్:జి సుబ్బారావు, పోస్టర్ డిజైనింగ్:విక్రమ్ విజన్స్, కాస్ట్యూమ్ డిజైనర్ అమృత బొమ్మి, పీఆర్‌వో:మడూరి మధు, కాస్ట్యూమ్ ఛీఫ్:సర్వేశ్వరరావు, కో ప్రొడ్యూసర్ పవన్‌కుమార్ బండి, నిర్మాతలు:రమ్య బురుగు, నాగేంద్ర రాజు, దర్శకత్వం:శ్రీనివాస్ ఓంకార్.దేశముదురు సినిమాతో తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసిన హన్సిక అనతికాలంలోనే అగ్రకథానాయికగా గుర్తింపును సొంతం చేసుకున్నది.ఆమె తెలుగులో నటిస్తున్న తొలి మహిళా ప్రధాన చిత్రం మై నేమ్ ఈజ్ శృతి ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు,నాగేంద్రరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఫిలింనగర్ దైవసన్నిధానంలో చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రేవతి క్లాప్‌నివ్వగా వైష్ణవి కెమెరా స్విఛాన్ చేశారు.తొలి సన్నివేశానికి వంశీ గౌరవ దర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో హన్సిక మాట్లాడుతూ నేను కథానాయికగా నటిస్తున్న 52వ చిత్రమిది.తెలుగు సినిమాలతోనే కథానాయికగా నా ప్రయాణం ఆరంభమైంది.నటిగా టాలీవుడ్ నాకు మంచి పేరును తీసుకొచ్చింది. తెలుగులో మరో మంచి సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. స్వేచ్ఛస్వాతంత్ర్యాలు కలిగిన శృతి అనే యువతిగా ఈ సినిమాలో కనిపిస్తా.తన భావాల్ని ధైర్యంగా వెల్లడించే యువతిగా విభిన్నంగా నా పాత్ర ఉంటుంది.ఆద్యంతం మలుపులతో ఆసక్తికరంగా సినిమా సాగుతుంది.కథ వింటున్నప్పుడు తర్వాత ఏం జరుగుతుందనే ముంగింపు వరకు నేను ఊహించలేకపోయాను.ఆ కొత్తదనం నచ్చే ఈ సినిమా అంగీకరించాను అని తెలిపింది. నటుడు సాయితేజ మాట్లాడుతూ ఇది నా మూడో సినిమా. ఇందులో ఓ మంచి పాత్రను పోషిస్తున్నా.హన్సికకు జోడీగా కనిపిస్తాను అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ కొంత గ్యాప్ తర్వాత తెలుగులో హన్సిక నటిస్తున్న చిత్రమిది. తప్పకుండా బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుంది.తర్వాత ఏం జరుగుతుందనే ప్రేక్షకుల ఊహకు అందదు.ఇలాంటి ట్విస్ట్‌లతో ఇప్పటివరకు వెండితెరపై సినిమా రాలేదు. నటన పరంగా లీడ్‌రోల్ చాలెంజింగ్‌గా ఉంటుంది.కథ విన్న తర్వాత ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా మంది భయపడ్డారు. హన్సిక ధైర్యంగా ఈ సినిమాను అంగీకరించింది అని అన్నారు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్ మాట్లాడుతూ ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందని చెబుతుంటారు.అలాగే ప్రతి మహిళ సంఘర్షణ వెనుక మగాడు ఉంటాడు. తన జీవితంలో ఎదురైన సంఘర్షణను ఓ యువతి ఎలా ఎదుర్కొన్నదన్నది ఈ చిత్ర ఇతివృత్తం.లాక్‌డౌన్ టైమ్ కావడంతో హన్సికకు జూమ్ యాప్ ద్వారా కథ చెప్పాలని అనుకున్నాం.కానీ ఆమె మాత్రం ముంబయి వచ్చి కథ చెప్పమని అన్నారు.హన్సిక ఇంట్లోనే ఆమెకు నాలుగున్నర గంటలు కథ చెప్పా.వెంటనే సినిమాను అంగీకరించింది. సోమవారం నుంచి తొలి షెడ్యూల్‌ను మొదలుపెట్టబోతున్నాం.ఈ నెలాఖరున సెకండ్ షెడ్యూల్, ఆగస్ట్‌లో మూడో షెడ్యూల్‌ను ప్రారంభిస్తాం.నాలుగేళ్లుగా నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశాన్ని నిర్మాతలు ఇవ్వడం ఆనందంగా ఉంది అని చెప్పారు. మురళీశర్మ, ఆర్ నారేయనన్, జయప్రకాష్, వినోదిని, సాయితేజ, పూజా రామచంద్రన్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కిశోర్ బోయిడపు,కళా దర్శకత్వం: గోవింద్,సంగీతం:మార్క్ కె రాబిన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్:జి సుబ్బారావు, పోస్టర్ డిజైనింగ్:విక్రమ్ విజన్స్, కాస్ట్యూమ్ డిజైనర్ అమృత బొమ్మి, పీఆర్‌వో:మడూరి మధు, కాస్ట్యూమ్ ఛీఫ్:సర్వేశ్వరరావు, కో ప్రొడ్యూసర్ పవన్‌కుమార్ బండి, నిర్మాతలు:రమ్య బురుగు, నాగేంద్ర రాజు, దర్శకత్వం:శ్రీనివాస్ ఓంకార్.
ఊహకందని మలుపులతో మై నేమ్ ఈజ్ శృతి- హన్సిక