జూన్ 3న విడుదలకు సిద్ధమైన `మయూరాక్షి `
శ్రీ శ్రీ శ్రీ శూలిని దుర్గా ప్రొడక్షన్స్ పతాకంపై `భాగమతి` ఫేం ఉన్ని ముకుందన్ హీరోగా మియా జార్జ్ హీరోయిన్ గా రూపొందిన చిత్రం `మయూరాక్షి` . యువ నిర్మాత వరం జయంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సూపర్ హిట్ చిత్రాల సంగీత దర్శకుడు గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే ప్రజాదరణ పొందాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం జూన్ 3న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…“పాటలు వినసొంపుగా ఉన్నాయి. ట్రైలర్ చాలా రిచ్ గా ఎంతో క్యూరియాసిటీతో ఉంది. ట్రైలర్ చూశాక ఇదొక సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. ప్రస్తుతం ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇంజనీరింగ్ చదువుకున్న జయంత్ సినిమాల మీద ఆసక్తితో నిర్మాతగా మారి ఇప్పటికి రెండు చిత్రాలు రిలీజ్ చేశారు. ఇది తన మూడో చిత్రం. ప్యాషన్ తో వచ్చే కొత్త నిర్మాతలను ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి చిత్రాలు వస్తాయి. ఎంతో మందికి పని దొరుకుతుంది. ఈ సినిమా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
`గంగపుత్రులు` హీరో రాంకీ మాట్లాడుతూ…“మయూరాక్షి ట్రైలర్ , పాటలు చాలా బావున్నాయి. ఒక యంగ్ ప్రొడ్యూసర్ చేస్తోన్న ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.
నిర్మాత వరం జయంత్ కుమార్ మట్లాడుతూ…“ సస్పెన్స్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. ఉన్ని ముకుందన్, మియా జార్జ్ నటన, గోపీసుందర్ మ్యూజిక్ సినిమాకు హైలెట్స్. జూన్ 3న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః గోపీ సందర్; పాటలుః పూర్ణాచారి; కో-ప్రొడ్యూసర్ః వరం యశ్వంత్ సాయి కుమార్; నిర్మాతః వరం జయంత్ కుమార్; దర్శకుడుః సాయిజు ఎస్.ఎస్