హైద‌రాబాద్‌లో ఇండియన్ ఐడ‌ల్ టాప్ గాయ‌కుల‌తో ప్ర‌త్య‌క్ష సంగీత కార్య‌క్ర‌మం

హైదరాబాద్ 29 ఆగష్టు 2021:

ఇండియ‌న్ ఐడిల్‌లో విజేత‌గా నిలిచిన ప‌వ‌న్‌దీప్ రాజ‌న్, తెలుగ‌మ్మాయి ష‌ణ్ముక ప్రియ‌తోపాటు మ‌రో ఇద్ద‌రు గాయకుల‌తో హైద‌రాబాద్‌లో తొలిసారిగా ప్ర‌త్య‌క్ష సంగ‌త కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించేందుకు 11.2, మెట‌లాయిడ్ ప్రొడ‌క్ష‌న్స్ ఈవెంట్ ఆర్గ‌నైజ్డ్ సంస్థ‌లు నిర్వ‌హించ‌నున్నాయి. కొవిడ్ నేప‌థ్యంలో దాదాపు 18నెల‌ల సుదీర్ఘ విరామం త‌రువాత ప్ర‌త్య‌క్ష సంగీత క‌చేరిల‌కు ఇదే తొలి వేదిక కానుంది. రివైవ్ కన్స‌ర్ట్ సిరీస్ పేరుతో ఇప్పుడు అభిమానుల ముందుకు తిరిగి వ‌స్తున్నాం. ఈ సెప్టెంబ‌రు నుంచి బ్యాండ్‌, సింగ‌ర్‌, మ్యుజీషియ‌న్‌లతో క‌లిసి సెప్టంబ‌ర్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు ప్ర‌తి వారం ప్ర‌ద‌ర్శ‌న‌కు సిద్దమ‌వుతున్నాం.

ఈ సంద‌ర్భంగా మెటలోయిడ్ ప్రొడక్షన్ ప్ర‌తినిధి ప్రీతిష్ కోలాటి మాట్లాడుతూ..  ఇది రెండో ద‌శ సంగీత వేదిక‌గా మీము భావిస్తున్నాం. ప్ర‌తిభావంతులైన క‌ళాకారుల‌ను మీముందుకు తీసుక‌చ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇందులో భాగంగానే కేర‌ళ‌కు చెందిన తైక్కుడం బ్రిడ్జ్‌, మ‌సాలా కాఫీ, ఇండియ‌న్ ఐడిల్ షోలో ఫైన‌లిస్టుల‌ను ఈ వేదిక‌పైకి తీసుకొస్తున్నాం. తైక్కుడం బ్రిడ్జ్ క‌ళాకారుల ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 2న, ఇండియ‌న్ ఐడ‌ల్ విజేత ప‌వ‌న్‌దీప్ రాజన్‌తో సెప్టెంబ‌రు 3న హార్ట్‌క‌ప్‌లో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించేందుకు సిద్ద‌మ‌వుతున్నాం. ఈ సిరీస్‌లో దేశంలోని అత్యుత్త‌మ‌మైన సంగీత‌కారుల‌తోపాటు గాయ‌కులు పాలుపంచుకొని అబిమానుల‌ను ఉర్రూత‌లుగించ‌నున్నారు.

ఇండియన్ ఐడల్ విజేత పవణ్‌దీప్ రాజన్, మొదటి రన్నరప్ అరుణిత కంజిలాల్, రెండవ రన్నరప్ సైలి, మూడవ  రన్నరప్ మొహమ్మద్ డానిష్ మరియు రాక్‌స్టార్ షణ్ముఖ ప్రియ బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.