హిమాల‌య స్టూడియో మేన్స‌న్స్ ప‌తాకంపై సాయి రోన‌క్‌,  నేహ‌ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖ‌ర్ రేపల్లే ద‌ర్శ‌క‌త్వంలో ఉద‌య్ కిర‌ణ్  నిర్మించిన  చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`.  ఈ చిత్రం ఈనెల 19న విడుద‌లై పాజిటివ్ టాక్ తో స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతూ  థియేట‌ర్స్ పెంచుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఈ రోజు సంస్థ కార్యాల‌యంలో స‌క్సెస్  మీట్ ఏర్పాటు చేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత ఉద‌య్ కిర‌ణ్ మాట్లాడుతూ…“ఛ‌లో ప్రేమిద్దాం` చిత్రాన్ని ఇంత పెద్ద స‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు. మా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుందంటే మా ఆర్టిస్ట్స్ , టెక్నీషియ‌న్స్ కార‌ణం. అంద‌రూ సిన్సియ‌ర్ ఎఫ‌ర్ట్ పెట్టారు.  ఈ సినిమా స‌క్సెస్ మ‌రెన్నో సినిమాలు చేయ‌డానికి నాకు మంచి బూస్ట‌ప్ ఇచ్చింది. ఇక‌పైన కూడా మా సంస్థ నుంచి వ‌చ్చే చిత్రాల‌ను ఈ విధంగానే ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
ద‌ర్శ‌కుడు సురేష్ శేఖ‌ర్ రేపల్లె మాట్లాడుతూ…“మా సినిమాకు విడుద‌లైన అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.  ముఖ్యంగా పాట‌లు, నేప‌థ్య‌ సంగీతం, ద‌ర్శ‌క‌త్వం, కామెడీ , నిర్మాణ విలువ‌లు సినిమాకు ప్ల‌స్ అంటున్నారు. ఆడియ‌న్స్ తో  క‌లిసి ఫ‌స్ట్ రోజు సినిమా చూశాను.  అదుర్స్ ర‌ఘు కామెడీ, పోసాని, హేమ మ‌ధ్య వ‌చ్చే ఫ‌న్, అత్తారింటికి దారిది  ఎపిసోడ్ కు ఆడియ‌న్స్ ప‌డి ప‌డి న‌వ్వుతున్నారు. క్లైమాక్స్ లో వ‌చ్చే ట్విస్ట్   , శ‌శాంక్ ,నాగినీడు, సిజ్జు పాత్ర‌లు సినిమాకు హైలెట్ అంటున్నారు.  సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుందంటే మా టీమ్ స‌పోర్ట్ వల్లే. కొత్త డైర‌క్ట‌ర్ లా కాకుండా ఎంతో అనుభ‌వం ఉన్న డైర‌క్ట‌ర్ లా సినిమా  తీశాడంటూ రివ్యూస్ లో రాశారు. అలాగే ఒక చిన్న సినిమాకు నిర్మాణ విలువ‌లు బావున్నాయంటున్నారంటే  నిర్మాత రాజీ ప‌డ‌ని త‌త్వ‌మే కార‌ణం.  వ‌ర్షాల్లో కూడా మా సినిమాను ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు, మా సినిమాకు మంచి ప్ర‌మోష‌న్ అందిస్తోన్న  మీడియా వారికి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.
 హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ….“ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎదురు చూశాను.  అంద‌రూ  నా ప‌ర్ఫార్మెన్స్ , డాన్స్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా బావుందంటూ చాలా మంది కాల్స్ చేసి చెబుతుంటే హ్యాపీగా ఉంది. ఇంత‌ మంచి హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు“ అన్నారు.
 న‌టుడు అదుర్స్ ర‌ఘు మాట్లాడుతూ…“ఈ నెల 19న విడుద‌లైన మా సినిమాకు అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ బావుంది. చాలా మంది ఫోన్ చేసి నా పాత్ర గురించి చెబుతుంటే చాలా హ్యాపీగా ఉంది. నా పాత్ర‌కు ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుందంటే మా డైర‌క్ట‌ర్ సురేష్ గారే కార‌ణం. చిన్న సినిమాగా విడుద‌లై పెద్ద స‌క్సెస్ సాధించింది. ఇంకా పెద్ద హిట్ చేసి  డైర‌క్ట‌ర్ కి మ‌రెన్నో సినిమాలు చేసే అవ‌కాశం, నిర్మాత‌కు లాభాలు రావాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు.
 న‌టి అక్ష‌ఖాన్ మాట్లాడుతూ…“ఒక మంచి సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవ‌డం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇందులో గెస్ట్ రోల్  చేశాను. మంచి అప్లాజ్ వ‌స్తోంది. ఇంత మంచి అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శక నిర్మాత‌ల‌కు ధ్యాంక్స్ “ అన్నారు.
జ‌బ‌ర్ద‌స్త్ ప‌వ‌న్ మాట్లాడుతూ….“థియేట‌ర్ లో నా క్యార‌క్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఒక హిట్ సినిమాలో నేను కూడా పార్ట్ అవ‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.
 కొరియోగ్రాఫ‌ర్ వెంక‌ట్ మాట్లాడుతూ…“సంధ్య థియేట‌ర్ లో సినిమా చూశాను. సాంగ్స్ కు విజిల్స్ ప‌డుతున్నాయి. సింగిల్ కార్డ్ చేసే అవ‌కాశం క‌ల్పించిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక నాకు మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి“ అన్నారు.
 శ‌శాంక్, సిజ్జు,  అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌,  హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ;  పాట‌లుః సురేష్ గంగుల‌, దేవ్‌, ఎడిటింగ్ః ఉపేంద్ర జ‌క్క‌; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః రామాంజ‌నేయులు;  పీఆర్వోః ర‌మేష్ చందు, న‌గేష్ పెట్లు,  ఫైట్స్ః న‌భా-సుబ్బు, కొరియోగ్ర‌ఫీః వెంక‌ట్ దీప్‌;  సినిమాటోగ్ర‌ఫీః అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి;  నిర్మాతః  ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె.