బాలీవుడ్‌లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని లీడింగ్ సినిమాటోగ్రాఫర్ కబీర్‌లాల్. రీసెంట్‌గా మరాఠీలో అదృశ్య అనే సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. అదృశ్యకి క్రిటిక్స్ ప్రశంసలు, ఆడియన్స్ సపోర్ట్ మాత్రమే కాదు, ఐఎండీబీ కూడా 9.5 రేటింగ్‌తో మెచ్చుకుంది. నార్త్ లో గొప్ప పేరు తెచ్చుకున్న కబీర్‌లాల్ ఇప్పుడు సౌత్ ఇండియాలో, మన తెలుగులో సినిమాలు చేయడానికి నడుం బిగించారు.
లవ్లీ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ బేస్డ్ నావల్ కాన్సెప్ట్ తో దివ్యదృష్టి అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు కబీర్‌లాల్. ఈషా చావ్లా ఇందులో లీడ్ రోల్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన పనులన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తన సోదరి హత్యకు కారణమైన వారిని వెతికి కనిపెట్టాలనుకునే కంటిచూపులేని అమ్మాయి కథే దివ్యదృష్టి. హంతకులను వెతకడానికి ఆమె చేసిన కృషి, తదనంతర పరిస్థితులు కీలకంగా సినిమా సాగుతుంది.
గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌ని రూపొందిస్తున్నారు. కమల్ కామరాజు ఈ చిత్రంలో బిజినెస్‌మేన్‌గా నటిస్తున్నారు. ఈషా చావ్లా చేస్తున్న దివ్య కేరక్టర్‌కి హజ్‌బెండ్‌గా కనిపిస్తారు కమల్. నిళల్‌గళ్ రవి, తులసి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత అజయ్‌కుమార్ సింగ్ ఇందులో పోలీస్ ఇన్‌స్పెక్టర్ రోల్ చేస్తున్నారు. వీళ్లు మాత్రమే కాదు, ఇంకా పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లవ్లీ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ సినిమాను అజయ్‌కుమార్ సింగ్ నిర్మిస్తున్నారు. భారతీయ భాషల్లో 100కి పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కబీర్‌లాల్ ఈ సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈ సినిమాకు కెమెరా: షాహిద్ లాల్, సౌండ్ డిజైన్: కబీర్ లాల్, ఎడిటింగ్: సతీష్ సూర్య, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అచ్చు రాజామణి, మాటలు: ఇ.గౌరీశంకర్, కళ: విజయ్ కుమార్, పబ్లిసిటీ డిజైన్స్: నెక్స్ట్ జెన్ స్టూడియోస్.
మేకర్స్ అనౌన్స్ చేసిన పేర్లు మాత్రమే కాదు, సినిమా రిలీజ్ అయ్యాక నటీనటుల్లో ఓ వ్యక్తిని చూసి సర్‌ప్రైజ్ ఫీలవడం ఆడియన్స్ వంతు అవుతుంది.