‘‘ఛీ దీనమ్మా తాగితే కానీ మా బతులకి ఏడుపు రాదు.. తాగినోడి ఏడుపుకేమో వేల్యూ లేదు’’ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ పెళ్లి కొడుకు అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్) పెళ్లి కూతురు (రుక్సర్ థిల్లాన్)తో ఎమోష‌న‌ల్‌గా డైలాగ్ చెబితే ఎలా ఉంటుంది! క‌చ్చితంగా అదేదో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి అయితే క‌లుగుతుంది. మూడు ప‌దుల వ‌య‌సున్న అర్జున్ కుమార్‌కి పెళ్లి ఎందుకు కాలేదు. చివ‌ర‌కి పెళ్లి కోసం అర్జున్ కుమార్ అండ్ ఫ్యామిలీ ఏం చేశారు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘అశో వ‌నంలో అర్జున కళ్యాణం’ మూవీ చూడాల్సిందే. 
ఫ‌ల‌క్‌నుమాదాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్‌.. ఎంట‌ర్‌టైనింగ్ చిత్రానికి.. సూప‌ర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. మార్చి 4న ఈ చిత్రం విడుదలవుతుంది. బుధవారం ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. 
టీజర్ గ‌మ‌నిస్తే… ఇంట‌ర్ క్యాస్ట్ అరెంజ్డ్ మ్యారేజ్ (పెద్ద‌లు కుదిర్చిన కులాంత‌ర వివాహం) సినిమాల్లోనే అయితాదారా.. లేక ఇదే ఫ‌స్టా! అని ఓ అమ్మాయి అడ‌గ‌టంతో ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ టీజ‌ర్ స్టార్ట్ అయ్యింది. ఇందులో విశ్వ‌క్ సేన్ పెళ్లి కొడుకుగా క‌నిపిస్తున్నారు. విశ్వ‌క్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్‌ల‌పై ఎంట‌ర్‌టైనింగ్ స‌న్నివేశాల‌ను చూపించారు. టీజ‌ర్ చివ‌ర‌లో విశ్వ‌క్ సేన్ ఏడుస్తూ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా ఉంది. టీజ‌ర్‌లో స‌న్నివేశాల్లో పాత్ర‌ల‌ చిత్రీక‌ర‌ణ‌, పిక్చ‌రైజేష‌న్‌తో పాటు డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. విద్యా సాగ‌ర్ చింతా చిత్రాన్ని తెర‌కెక్కించారు. 
జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.
న‌టీన‌టులు:
విష్వ‌క్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌క‌త్వం: విద్యాసాగ‌ర్ చింతాస‌మ‌ర్ప‌ణ‌: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌కథ, మాటలు, స్క్రీన్ ప్లే : ర‌వి కిర‌ణ్ కోలాబ్యాన‌ర్‌: ఎస్‌.వి.సి.సి.డిజిట‌ల్‌నిర్మాత‌లు: బాపినీడు, సుధీర్ ఈద‌ర‌సినిమాటోగ్ర‌ఫీ: ప‌వి కె.ప‌వ‌న్‌సంగీతం: జై క్రిష్‌ఎడిట‌ర్‌: విప్ల‌వ్‌ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి