అభినవ్ సర్దార్, రామ్ కార్తీక్ హీరోలుగా వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామ్ అసుర్. చాందిని త‌మిళ్‌రాస‌న్‌,  శెర్రి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించగా విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఈ సినిమా లో కథ హైలైట్ కాగా అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్, శానీ సల్మాన్ ల నటన మెయిన్ హైలైట్ గా నిలిచింది. హీరోయిన్స్ గ్లామర్ అదనపు ఆకర్షణ. దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ సరికొత్త కథ కథనాలతో ఆద్యంతం ఈ సినిమా ను ప్రేక్షకులు అలరించే విధంగా ముందుకు తీసుకెళ్లారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఈమధ్య కొన్ని నగరాల్లో ప్రేక్షకులతో కలిసి సినిమా ను వీక్షించిన చిత్ర బృందం తాజాగా వరంగల్ లో సందడి చేసింది. గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారితో కలిసి సినిమా ను వీక్షించింది చిత్ర బృందం.
ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రామ్ అసుర్ సినిమా అద్భుతంగా ఉంది. హీరో అభినవ్ సర్దార్, రామ్ కార్తిక్ ల నటన చాలా బాగుంది. ప్రత్యేకమైన పాత్రలో శానీ సల్మాన్ మంచి నటన కనపరిచాడు. దర్శకుడు వెంకటేష్ ఈ సినిమా ను మంచి కథ తో తెరకెక్కించి విజయం సాధించారు. ఈ చిత్రాన్ని యూనిట్ తో కలిసి వీక్షించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి వసూళ్లను సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.