తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ అందిస్తోన్న 100 పర్సెంట్ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో సంతోశ్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన హిట్ మూవీ ‘మంచి రోజులు వచ్చాయి’ డిసెంబర్3న ఆహా ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్గా విడుదలైన ఈ చిత్రం థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యి ప్రేక్షకులతో పాటు విమర్శకులు ప్రశంసలు కూడా అందుకుంది. రొమాంటిక్, కామెడీ, ఎమోషన్స్.. ఇలా అన్నీ ఎలిమెంట్స్ కలగలసి మంచి మెసేజ్ ఉన్న ప్యాకేజీ మూవీ ‘మంచిరోజులు వచ్చాయి’.
పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగులైన సంతోశ్, పద్మ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఇండియాలో పాండమిక్ ప్రారంభం అవుతుంది. ఆ కారణంగా వారిద్దరూ స్వస్థలం హైదరాబాద్ చేరుకుంటారు. పద్మ తండ్రి గోపాలంకు తన కూతురంటే అమితమైన ప్రేమ. తన కూతురు మరో అబ్బాయితో ప్రేమలో ఉందనే విషయం గోపాలంకు తెలుస్తుంది. దాన్ని ఆయన వ్యతిరేకిస్తాడు. సాధారణంగా గోపాలం భయస్థుడు. దాన్ని అలుసుగా తీసుకుని చుట్టూ ఉన్న వారి చిన్న చిన్న విషయాలకే ఆయన్ని భయపెడుతుంటారు. ఆ కారణంగా ఆయనలో భయం ఇంకా పెరుగుతుందే కానీ, తగ్గదు. అలాంటి భయంతో కూతురి ప్రేమను ఆయన ఒప్పుకోడు. సంతోశ్ కంటే మంచి సంబంధం తీసుకొచ్చి కూతురికి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో గోపాలం తనలోని భయాలను ఎలా అధిగమిస్తాడు. గోపాలం ఫ్యామిలీకి సంతోశ్ ఎలా సపోర్ట్‌గా నిలుస్తాడు? సంతోశ్, పద్మ ప్రేమను గోపాలం అర్థం చేసుకుంటాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే డిసెంబర్ 3న ‘ఆహా’లో ప్రసారం కాబోయే ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా చూడాల్సిందే.
సంతోశ్ శోభన్, మెహరీన్లతో పాటు అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్, ప్రవీణ్ వంటి నటీనటులు అద్భుతమైన నటనను ప్రదర్శించారు. దీనికి అనూప్ రూబెన్స్ తనదైన సంగీతం, నేపథ్య సంగీతం తోడైంది. సాయిశ్రీరామ్ తనదైన స్టైల్లో ఎక్స్ట్రార్డినరీ విజువల్స్‌ను అందించారు. సంతోశ్ శోభన్-మెహరీన్ కెమిస్ట్రీ, మారుతి స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సహా అన్నీ కలగలసిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ లాఫింగ్ రైడ్‌ను డిసెంబర్ 3న ‘ఆహా’లో చూసి ఎంజాయ్ చేసేయండి.
2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమాలు – షోలు…. క్రాక్, లవ్‌స్టోరీ, లెవన్త్ అవర్, జాంబీ రెడ్డి, చావు కబురు చల్లగా, అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే, నాంది, 3రోజెస్, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్, నీడ, కాలా, ఆహా భోజనంబు, ఒన్, సూపర్ డీలక్స్, చతుర్ముఖం, తరగతిగదిదాటి, ది బేకర్ అండ్ ది బ్యూటీ, మహా గణేష, సర్కార్, పరిణయమ్, ఒరేయ్ బామ్మర్ది, కోల్డ్ కేస్, అల్లుడు గారు, ఇచట వాహనములు నిలుపరాదు వంటివాటికి కేరాఫ్ ఆహా. ప్రేక్షకులు ఆహాలో వీటిని చూసి ఆస్వాదించవచ్చు.