సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రాబోతోన్నమైఖెల్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైన‌ర్‌ చిత్రాన్ని రంజిత్ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

మైఖెల్ చిత్రంలో విలన్‌గా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ నటిస్తున్నారు. దర్శకుడిగా, నటుడిగా గౌతమ్ మీనన్ ఇప్పటికే అందరినీ తన టాలెంట్‌తో అబ్బురపరిచారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో చేతికి రక్తం, బేడీలు చూస్తుంటే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను చేస్తూ మంచి ఫాంలో ఉన్న సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్‌తో హిట్ సాధించారు. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ వంటి దిగ్గజాలతో కలిసి నటించబోతోన్నారు. ఈ ముగ్గురూ కలిసి తెరపై సందడిచేస్తే కన్నులపండుగ‌గా ఉంటుంది.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన పోస్టర్‌లో సందీప్ కిషన్ పాత్ర ఎలా ఉండబోతోంది..ఎంత ఇంటెన్సిటీతో ఉండబోతోందనేది తెలిసింది. ఆ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

రజింత్ జయకోడి ఈ చిత్రానికి విభిన్నమైన స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. నటీనటులకు ఈ చిత్రం స్పెషల్‌గా నిలిచిపోనుంది.

నారాయణ్ దాస్ కే నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కర్ రామ్ మోహన్ రావు కలిసి ఈ చిత్రాన్ని భారీ గా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

చిత్ర నటీనటులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

సాంకేతిక బృందం

దర్శకుడు  : రంజిత్ జయకోడి
నిర్మాతలు :  భరత్ చౌదరి, పుస్కర్ రామ్ మోహన్ రావు
సమర్పణ  : నారాయణ్ దాస్ కే నారంగ్
బ్యానర్ :  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి,కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శివ చెర్రీ