తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు అల్లు అర్జున్ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో ఆయన నేషనల్ వైడ్ గా ఇమేజ్ సంపాదించుకున్నారు. ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు కమర్షియల్ యాడ్స్ కూడా వరుసగా చేస్తున్నారు అల్లు అర్జున్. తాజాగా ఈయన జొమాటోకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన యాడ్ ఇప్పుడు ప్రసారం అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు కూడా ఇందులో నటించారు. అల వైకుంఠపురంలో యాక్షన్ సన్నివేశం తలపించేలా ఈ యాడ్ చిత్రీకరించారు. ఇందులో బన్నీ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. మనసు కోరుతే తగ్గేదే లే.. అంటూ పంచ్ లైన్ తో వచ్చారు అల్లు అర్జున్. కేవలం జొమాటో మాత్రమే కాదు ఆహా, రాపిడో, శ్రీ చైతన్య కాలేజీలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అల్లు అర్జున్.