అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ అంథాలజీ `నవరస` విడుదలకు ముందు, కోలీవుడ్‌లో నెట్‌ఫ్లిక్స్ గ్లోబెల్ మ్యూజికల్ ఫ్యాన్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ అంథాలజీలోని 9 చిత్రాల్లోని ఎమోషన్స్ కలయికను తెలియజేసేలా, హృదయాన్ని స్పృశించేలా అందరూ ఇందులో ప్రాతినిధ్యం వహించారు.
అతిపెద్ద అంథాలజీ అయిన నవరస విడుదలకు సమయం దగ్గర పడుతుంది. కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతున్న ఈ అంథాలజీని వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఉత్సాహం పెంచడానికి, నవరసలోని తొమ్మిది భావోద్వేగాల రుచిని తెలియజేయడానికి నెట్‌ఫ్లిక్స్, సంగీతం, భావోద్వేగాలు, ప్రతిభల కలయికగా అద్భుతమైన `సింఫనీ ఆఫ్ ఎమోషన్స్` అనే గ్లోబెల్ ఫ్యాన్ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, మీడియా ప్రతినిధులు వర్చువల్ గాలాలోకి ట్యూన్ అయ్యారు. ఐకాన్ ఫిల్మ్ మేకర్స్ మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్ నేతృత్వంలో జరిగిన ఇండియన్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోని ఇలాంటి ఓ అద్భుతమైన, సాటిలేని క్షణాలను అందించే ఇలాంటి కార్యక్రమం కోసం తమిళ చిత్ర పరిశ్రమ అంతా ఒకచోట చేరింది. సింఫనీ ఆఫ్ ఎమోషన్స్ కార్యక్రమాన్ని దివ్యదర్శిని తన అద్భుతమైన ప్రసంగంతో ప్రారంభించారు. ఈ ప్రయాణంలో అండగా నిలబడ్డ అభిమానులు, క్రియేటర్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్ 19 సినీ పరిశ్రమలోని ఉద్యోగుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అటువంటి వారికి నిధుల సేకరించకోసం ఏర్పాటు చేయబడ్డ ఈ కార్యక్రమంలో మ్యూజిషియన్స్ స్టేజీపై అంథాలజీలోని సంగీతాన్ని ప్రదర్శించారు. నవరస వంటి అద్భుతమైన కార్యక్రమంలో భాగమైన నటీనటులు, దర్శకులకు , ప్రాజెక్ట్‌ను రూపొందించిన ప్రో బోనో వారికి చెల్లించాల్సిన మొత్తాలను సహాయక చర్యలకు విరాళంగా అందించింది.
పవర్ హౌస్‌లాంటి ప్రదర్శనను దగ్గరగా చూడటమే కాదు, అలాంటి ప్రదర్శనలను అభిమానులు చూసి వాటికి ప్రత్యక్షసాక్షులుగా నిలబడ్డారు. సింఫనీ ఆఫ్ ఎమోషన్స్ అనే పేరుకు తగ్గట్లుగానే ఇండస్ట్రీలోని మ్యూజిషియన్స్ తమ అద్భుమైన ప్రతిభను ప్రదర్శించారు. వేణుగాన ఆలపనలో సిద్ధహస్తుడైన నవీన్ కుమార్, అభిషేక్ కుమార్, కె.సి.లోయ్, వివేక్ రాజగోపాలన్, పియూష్ రజనీ, ఫైన్ ట్యూనర్ మహేశ్ రాఘవన్, నందినీ శంకర్, శాషా తిరుపతి, అనంత ఆర్.కృష్ణన్, రికీ కెజ్, కునాల్ నాయక్ వంటి 50 మంది సభ్యులతో లెజెండ్ ఎ.ఆర్.రెహమాన్ ప్రదర్శన చేశారు.
గురువారం సాయంత్రం జరిగిన ఈ వర్చువల్ కార్యక్రమంలో ఈ అంథాలజీ క్రియేటర్స్, నటీనటులు, దర్శకులు, మ్యూజిషియన్స్, వివిధ శాఖలకు చెందినవారందరూ భాగమయ్యారు. వీరందరూ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ సంభాషించుకున్నారు. `నవరస`పై తమకున్న ప్రేమను తెలియజేస్తూ 46 మంది సభ్యులు స్క్రీన్‌ను షేర్ చేసుకున్నారు. చిత్రీకరణ సమయంలో వారు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ “ఈ రోజు కార్యక్రమంలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కోసం ఇంత మంది టాలెంటెడ్ పర్సన్స్ కలిసి పనిచేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది. `నవరస` సమర్ధవంతమైన వ్యక్తుల దగ్గర చేరినందుకు చాలా ఆనందంగా ఉంది“ అన్నారు. జయేంద్ర పంచపకేశన్ మాట్లాడుతూ “కోవిడ్ 19 సెకండ్ వేవ్ పరిస్థితుల్లో మా అంథాలజీ కోసం పనిచేసిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, వారి ఆత్మ, హృదయాలను ప్రాజెక్ట్‌పై కేంద్రీకరించి పనిచేశారు. ఇంకా ఇండస్ట్రీలో ఎక్కువ మందికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తున్నాం. కాబట్టి పరిశ్రమలోని చాలా మంది వీటిల్లో భాగస్వామ్యులు కావాలని కోరుకుంటున్నాం. ఎక్కువ మందిని ఇలాంటి ప్రాజెక్ట్స్‌లో భాగం చేయడమనే పదవ రసాన్ని మనం కనిపెట్టాలని మణిరత్నం సూచించారు“ అన్నారు. మనిషిలోని కోపం, కరుణ, ధైర్యం, అసహ్యం, భయం, నవ్వు, ప్రేమ, శాంతి, అద్భుతం వంటి తొమ్మిది రసాల ఆధారంగా రూపొందిన `నవరస`ను రూపొందించడానికి తమిళ చిత్ర పరిశ్రమలోని అద్భుతమైన క్రియేటర్స్ కలిసి ముందుకు వచ్చారు. భారతీయ చిత్ర పరిశ్రమంలో లార్జన్ దేన్ లైఫ్ అనే సంస్కృతికి ప్రాణం పోశారు.
నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 6 న 12:30 PMకు `నవరస` విడుదలవుతుంది.
నెట్‌ఫ్లిక్స్ గురించి..
డిజిటల్ రంగంలో వరల్డ్ నెంబర్ వన్‌గా రాణిస్తోన్న నెట్‌ఫ్లిక్స్‌కు 208 మిలియన్స్ మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. 190 దేశాలకు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు.. ఇలా డిఫరెంట్ జోనర్స్ కంటెంట్‌తో పలు భాషల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది నెట్‌ఫ్లిక్స్. వీక్షకులు(సబ్‌స్క్రైబర్స్) ఎక్కడ నుంచి, ఎంత వరకు అయినా, ఎలాంటి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లో అయినా ఎంజాయ్ చేయవచ్చు. సభ్యులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడటం, కావాలంటే వారు చూస్తున్న షోను కావాల్సినంత సేపు ఆపుకోవడం మళ్లీ కావాలంటే ఆపేసిన చోట నుంచే వీక్షించవచ్చు. ఇలా చేసే సమయంలో ఎలాంటి కమర్షియల్ యాడ్స్, డిస్ట్రెబన్స్ ఉండవు. నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించి లేటెస్ట్ న్యూస్, అప్‌డేట్స్ IG@Netflix_IN, TW@Netflixindia TW South@Netflix_INSouth and FB@NetflixIndiaలను ఫాలోకండి
భావోద్వేగాల కలయిక9 చిత్రాలు.. 9 భావోద్వేగాలు.. ఒక వేడుక - నవరస