టాలీవుడ్‌లో భద్ర ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణసంస్థగా అవతరించబోతోంది. విభిన్న చిత్రాలను భారీ బడ్జెట్‌లో నిర్మించేందుకు రెడీ అవుతోంది. అందులో భాగంగా వారి మొదటి చిత్రం నవీన్ చంద్ర హీరోగా శ్రీనివాస రాజు దర్శకత్వంలో రాబోతుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘తగ్గేదే లే’ టైటిల్ ను పెట్టారు.
నేడు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న దివ్యా పిళ్లై ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. దివ్యా పిళ్లై పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. చీరకట్టులో అందరినీ ఆకట్టుకుంది. నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.
ఇది వరకే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌కు విశేషమైన ఆదరణ లభించింది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది.
దివ్యా పిళ్లై, అనన్య సేనుగుప్తా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, అయ్యప్ప శర్మ, నవీన్ చంద్ర, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్‌గా, చరణ్ అర్జున్ సంగీత దర్శకుడిగా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు.
నటీనటులు: నవీన్ చంద్ర, దివ్యా పిళ్లై, అనన్య సేనుగుప్తా, నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండే, అయ్యప్ప శర్మ, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్
సాంకేతిక బృందం
రచయిత, దర్శకత్వం: శ్రీనివాస్ రాజు
నిర్మాత: భద్ర ప్రొడక్షన్స్
సంగీతం: చరణ్ అర్జున్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజా రవీందర్
సినిమాటోగ్రఫర్: వెంకట్ ప్రసాద్
ఎడిటర్: గ్యారీ బీహెచ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: చిన్నా
లిరిక్స్: భాస్కర భట్ల, రామ జోగయ్య శాస్త్రి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
ఫైట్ మాస్టర్: వెంకట్