సోగ్గాడే చిన్నినాయన..చిత్రంతో కింగ్ నాగార్జున, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మ్యాజిక్ చేశారు. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు చిత్రం రాబోతోంది. అనూప్ రూబెన్స్ సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ఇచ్చిన సంగీతం ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బంగార్రాజు కోసం మరోసారి అధ్బుతమైన ట్యూన్స్ రెడీ చేశారు.
బంగార్రాజు సినిమాతో పాటు పాటల మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన లడ్డుండా పాటకు సంబంధించిన ప్రోమో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
అనూప్ రూబెన్స్ క్యాచీ ట్యూన్‌ను అందించారు. నాగార్జున మాటలతో ఈ పాట ప్రారంభం అవుతుంది. తన తబలా, హార్మోనియం రెడీయా అంటూ పాటకు సిద్దమవుతారు. నాగార్జున ప్రత్యేకమైన యాసలో పాడిన పాట, పలికిన పదాలు అందరినీ మెప్పించాయి. పంచెకట్టులో మరోసారి నాగార్జున అందరినీ కట్టిపడేశారు.
ఈ పాటలో స్వర్గంలోని దేవ కన్యలతో నాగార్జున డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. నాగార్జునతో పాటుగా ధనుంజయ్, మోహన భోగరాజు, నూతన మోహన్, హరిప్రియలు ఈ పాటను ఆలపించారు. భాస్కర భట్ల క్యాచీ పదాలతో మంచి సాహిత్యం అందించారు.
బంగార్రాజు పాత్రలో నాగార్జున మరోసారి అందరినీ మెప్పించబోతున్నారు. బంగార్రాజు పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ పాటతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టడం విశేషం.
బంగార్రాజు చిత్రంలో యువ సామ్రాట్ నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. రమ్యకృష్ణతో పాటుగా కృతి శెట్టి కూడా ఈ చిత్రంలో కనిపించబోతోన్నారు.
ఈ రోజు మైసూర్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం మీద కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.
రొమాన్స్, ఎమోషన్స్, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో బంగార్రాజు చిత్రం రాబోతోంది. సోగ్గాడే చిన్ని నాయన వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి ప్రీక్వెల్ కావడంతో అంచనాలు ఆకాశన్నంటాయి. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ
సాంకేతిక బృందం
కథ, దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : అక్కినేని నాగార్జున
బ్యానర్స్ : జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి.
స్క్రీన్ ప్లే : సత్యానంద్
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫర్ : యువరాజ్
ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి