ఆర్‌.కె.సాగ‌ర్‌, ఓంకార్ శ‌శిధ‌ర్‌, ఆర్‌.కె.మీడియా కాంబినేష‌న్ మూవీ ` ది 100`.. టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ఆర్‌.కె.సాగ‌ర్‌, ఓంకార్ శ‌శిధ‌ర్‌, ఆర్‌.కె.మీడియా కాంబినేష‌న్ మూవీ ` ది 100`.. టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

హీరో ఆర్‌.కె.సాగ‌ర్‌.. `షాదీ ముభార‌క్‌` చిత్రంతో స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న క‌థానాయ‌కుడిగా డెబ్యూ డైరెక్ట‌ర్ రాఘ‌వ్ ఓంకార్ శ‌శిధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్‌.కె.మీడియా ర్క్స్‌ బ్యాన‌ర్‌లో `ది 100` అనే ఆస‌క్తిక‌ర‌మైన సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ బుధ‌వారం విడుద‌ల చేసింది.

ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌తో రూపొంద‌నున్న `ది 100` సినిమాలో ఆర్‌.కె.సాగ‌ర్.. విక్రాంత్ అనే ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఖాకీ యూనిఫామ్‌లో చేతిలో గ‌న్ ప‌ట్టుకుని వెన‌క్కి తిరిగి నిల‌బ‌డిన ఆర్‌.కె.సాగ‌ర్ లుక్ చాలా ఇన్‌టెన్స్‌గా ఉంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గా ఫిట్ లుక్‌తో క‌నిపించ‌డానికి సాగ‌ర్ త‌న శ‌రీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారని, సినిమా హై యాక్ష‌న్ మూవీగా రూపొంద‌నుంద‌ని పోస్ట‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ఈ ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌కు శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

న‌టీన‌టులు:
ఆర్‌.కె.సాగ‌ర్‌

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  రాఘ‌వ్ ఓంకార్ శ‌శిధ‌ర్‌
నిర్మాణ సంస్థ‌:  ఆర్‌.కె.మీడియా వ‌ర్క్స్‌
సినిమాటోగ్ర‌ఫీ:  శ్యామ్ కె.నాయుడు