యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమాలోని మొదటి సింగిల్ విడుదలైంది. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. పాటలోని లిరిక్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. గోపీచంద్ కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ పాటకు మరో ప్రత్యేకత ఉంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తి దాయక గీతం ఇది. సిరివెన్నెల గారు చివరిసారి రాసిన జీవిత సారాంశం ఈ పాటలో ఉండడంతో దర్శకుడు మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు.

పూజలు పునస్కారాలు నమస్కారాలు అన్నీ పక్కా కమర్షియల్..
దేవుడు జీవుడు భక్తులు అగత్తులు అన్నీ పక్కా కమర్షియల్..
ఎయిర్ ఫ్రీయా.. నో..
నీరు ఫ్రీయా.. నో..
ఫైర్ ఫ్రీయా.. నో..
నువ్ నుంచున్న జాగా ఫ్రీయా..
అన్నీ పక్కా పక్కా పక్కా కమర్షియల్..
జన్మించినా మరణించినా అవదా ఖర్చు..
జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు..

అంటూ ఈయన ఒక అందమైన పాట రాశారు. ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు అంటూ.. సిరివెన్నెల గారిని గుర్తు చేసుకున్నారు మారుతి. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్‌లో ఉంటాయని మారుతి చెప్పారు. సిరివెన్నెల గారి కలం నుంచి జాలువారిన చివరి అక్షరమాల ఇదే కావడం గమనార్హం. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

నటీనటులు:
గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు

టెక్నికల్ టీం:

ద‌ర్శ‌కుడు – మారుతి
స‌మ‌ర్ప‌ణ – అల్లు అరవింద్
బ్యాన‌ర్ – జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్
నిర్మాత‌ – బ‌న్నీ వాస్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ – ర‌వీంద‌ర్
మ్యూజిక్ – జ‌కేస్ బీజాయ్
స‌హ నిర్మాత – SKN
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సత్య గామిడి
లైన్ ప్రొడ్యూసర్ – బాబు
ఎడిటింగ్ – ఎన్ పి ఉద్భ‌వ్
సినిమాటోగ్ర‌ఫి – క‌ర‌మ్ చావ్ల‌