'ఆహా’లో ఆగ‌స్ట్ 20 నుంచి ‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’

హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’ ప్రేక్ష‌కుల‌కు వారి పాత జ్ఞాప‌కాల‌ను గుర్తు చేయ‌బోతుంది. అదెలా అనుకుంటున్నారా? ‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’ అనే వెబ్ సిరీస్‌తో. తెలియ‌ని ఓ పిచ్చి ఇష్టం, అమాయ‌క‌త్వంతో కూడిన ఫ‌స్ట్ ల‌వ్‌ను ప్రేక్ష‌కుల‌కు ఈ వెబ్ సిరీస్ ద్వారా ‘ఆహా’ ప‌రిచ‌యం చేయ‌నుంది. టి.వి.ఎఫ్ వారి ఒరిజిన‌ల్ ‘ఫ్లేమ్స్‌’ను తెలుగులో ‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’ అనే పేరుతో ఐదు ఎపిసోడ్స్ వెబ్ సిరీస్‌గా రీమేక్ చేసింది ‘ఆహా’.ఈ వెబ్ సిరీస్‌ను ‘పెళ్లిగోల‌’ ఫేమ్ మ‌ల్లిక్ రామ్ డైరెక్ట్ చేశారు. హ‌ర్షిత్ రెడ్డి, పాయ‌ల్ రాధాకృష్ణ‌, నిఖిల్ దేవాదుల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’ ఆగ‌స్ట్ 20 నుంచి గ్లోబ‌ల్ ప్రీమియ‌ర్‌గా ప్ర‌సారం కానుంది. హృద‌యానికి ఓ ఫీల్‌ను క‌లిగించేలా, ఫ‌న్నీగా ఉండే ఈ టీనేజ్ రొమాంటిక్‌ వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను ‘ఆహా’ విడుద‌ల చేసింది. ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల్లో వెబ్ సిరీస్‌పై మ‌రింత ఆస‌క్తిని పెంచింది. 
రాజమండ్రిలో ట్యూష‌న్స్ చెప్పే దంప‌తులు.. వారి కుమారుడే కృష్ణ అలియాస్ కిట్టు. అత‌ను సిన్సియ‌ర్ స్టూడెంట్ కానీ చ‌దువు వంట‌ప‌ట్ట‌దు. అత‌నికి వంట చేయ‌డంపై ఆస‌క్తి ఉంటుంది. మంచి చెఫ్ కావాల‌ని అనుకుంటుంటాడు. అయితే ‘జీవితమంటే జోక్ కాదు’ అంటూ అత‌ని తండ్రి అత‌న్ని నిరుత్సాహ‌ప‌రుస్తుంటాడు. అదే స‌మ‌యంలో ఆ ట్యూష‌న్ సెంట‌ర్‌కు వ‌చ్చిన జాస్మిన్ అనే అమ్మాయిని చూసి కృష్ణ ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఇద్ద‌రూ స‌ర‌దాగా క్లాసుల‌ను ఎగ్గొట్టి తిరుగుతుంటారు. కిట్టు ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డానికి, అత‌ని స్నేహితులు కూడా అత‌ని టిప్స్ చెబుతారు. మ‌రి వారి ప్రేమ ఎంత దూరం వెళుతుంది?
‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’ సిరీస్ టీనేజ్ వ‌య‌సులో ఉండే చిన్న చిన్న వెల‌క‌ట్ట‌లేని అనందాలు, సంఘ‌ర్ష‌ణ‌లు, మ‌న‌సు ప‌డే గంద‌ర‌గోళాలు, సంతోషాల‌ను కిట్టు అనే క్యారెక్ట‌ర్ ద్వారా వెల్ల‌డిస్తారు. కిట్టు జీవితంలో స్నేహాలు, టీనేజ్ రొమాన్స్‌, త‌ను చెఫ్ కావాల‌నే ల‌క్ష్యం వెంబ‌డి ప‌రుగు తీయ‌డం వంటి అంశాల‌ను చాలా ఆక‌ర్ష‌ణీయంగా రూపొందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన వీడియో సాంగ్‌, టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. 
 ‘ఆహా’ రీసెంట్‌గానే, అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించిన‌  అద్భుత‌మైన సైఫై థ్రిల్ల‌ర్ ‘కుడిఎడ‌మైతే’ వెబ్ సిరీస్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించింది. క్రాక్‌, లెవ‌న్త్ అవ‌ర్‌, జాంబిరెడ్డి, చావు క‌బురు చ‌ల్ల‌గా, నాంది, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, నీడ‌, కాలా, ఆహా భోజ‌నంబు, వ‌న్‌, చతుర్‌ముఖం వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్, వెబ్ షోస్‌ను 2021లో ప్రేక్ష‌కుల‌కు అందించింది ‘ఆహా’.