లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం “#69 సంస్కార్ కాలనీ . ఈ చిత్రం మార్చి 18న విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ ఎస్తర్ నోరోన్హా మీడియాతో ముచ్చటించారు.

నేను చిన్నపటినుంచి యాక్టర్ ని కానీ సింగర్ గా నా కెరీర్ ప్రారంభం అయింది. మా అమ్మ నాన్న వాళ్ళకి కూడా సంగీతం అంటే ఇష్టం అందుకే నాకు సింగింగ్ అంటే బాగా ఇష్టం. చిన్నపుడు కొంకిని సింగర్ గా మంచి పేరు వచ్చింది. కర్ణాటక సంగీతం, క్లాసికల్ సింగర్ గా ట్రైన్ అయ్యాను, చాలా షోస్ చేశాను కానీ సినిమాలోకి వస్తాను అనుకోలేదు. చదువు కోసం ముంబయి కి వచ్చాను. కథక్ మరియు హిందుస్తానీ వోకల్స్ నేర్చుకున్న. ఒక ఈవెంట్ లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ గారు నన్ను చూసి సినిమా లో నటిస్తారా అని అడిగారు. ప్రయత్నం చేద్దాం అనుకున్న. బాలీవుడ్ లో మూడు సినిమాలు చేశాను. తర్వాత డైరెక్టర్ తేజ గారు 1000 అబద్దాలు సినిమా లో నన్ను హీరోయిన్ గా తీసుకున్నారు. తర్వాత నా కెరీర్ మీకు తెలుసు.

గతంలో కూడా నాకు చాలా సినిమాలు వచ్చాయి కానీ నాకు నచ్చలేదు. #69 సంస్కార్ కాలనీ సినిమా కథ బాగా నచ్చింది. ఇందులో నేను వైశాలి గా ఒక సాధారణ హౌస్ వైఫ్ గా కనిపిస్తాను. తన సాధారణ జీవితం లో ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ స్టైల్ ఉంటే ఎలా ఉంటుంది, తన జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతోంది అనేది కథ. వైశాలి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న క్యారెక్టర్. వైశాలి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్ నేను చేయడం గర్వంగా ఉంది. కెమెరా మాన్ శివరామ్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. ప్రతి కుర్రవాడి ఫాంటసీ వైశాలి. ప్రేక్షకులందరికీ ఎంతో నచ్చుతుంది.  

ఇటీవల విడుదల అయ్యిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలా మంది ఫోన్ చేసి వైశాలి వైశాలి అని పిలుస్తున్నారు, ట్రైలర్ అందరికి కనెక్ట్ అయింది, సినిమా కూడా అందరికి నచ్చుతుంది అనే నమ్మకం నాకుంది.  మార్చ్ 18న విడుదల అవుతుంది అందరు చుడండి.  ఈ చిత్రం లో “రా రా” అని పాట కూడా  పాడాను. పాట చాలా నచ్చింది. సోషల్ మీడియా లో అందరు ఆ  పాటని షేర్ చేస్తున్నారు. నాకు ఆ రెస్పాన్స్ ఎంతో ఆనందం కలుగజేసింది.

ట్రైలర్ లో ఉన్న బోల్డ్ నెస్ నాకు కిక్ ఇచ్చింది. అందరి జీవితం లో బోల్డ్ నెస్ ఉంటుంది  కానీ ఎవరు దాని గురించి మాట్లాడుకోరు. అలాంటి కథ లో నేను నటిస్తే నాకు మంచి పేరు వస్తుంది అని భావించాను. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా.

ఈ చిత్రం లో నాకు అజయ్ గారు మరియు రిశ్వి తో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. అజయ్ గారు నాకు సీనియర్ మరియు రిశ్వి కి నేను సీనియర్. అజయ్ గారు ఈ సినిమా చేస్తున్నారు అంటే నేను ఎక్సైట్ అయ్యాను. అజయ్ గారు చాలా బాగా నటించారు. రిశ్వి కూడా బాగా చేసారు. కిస్సింగ్ సీన్ చేసేటప్పుడు రిశ్వి చాలా భయపడ్డాడు, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము.

డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ చేశారు. చాలా బాగా ట్రీట్ చేశారు.

ప్రస్తుతం తెలుగు లో  ఐరావతం సినిమా రిలీజ్ కి దగ్గర గా ఉంది. ఒక జీ 5 కి  వెబ్ సిరీస్ చేస్తున్నాను. రుద్రా అని సినిమా షూటింగ్ లో ఉంది. మూడు భాషల చిత్రం ఒకటి చేస్తున్నారు.