అతిశయోక్తులు, పగలు ప్రతీకారాలు వంటివి లేకుండా నిజానికి దగ్గరగా సరికొత్త లోకంలో తీసుకెళ్ళి అందరినీ మెప్పించేలా గంధర్వ చిత్రం...
Interviews
వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో సుధాకర్ ఇంపెక్స్ పతాకంపై డా. రాజశేఖర్ హీరోగా ప్రకాష్ రాజ్,శివాని, ఆత్మీయ రాజన్, జార్జ్...
వెర్సటైల్ స్టార్ అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన...
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్...
హుషారు, రౌడీ బాయ్స్ లాంటి సూపర్‌హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న నటుడు తేజ్...
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్...
తానా ప్రపంచ సాహిత్య వేదిక మరియు సిరివెన్నెల కుటంబం సంయుక్తంగా శిల్ప కళా వేదికలో రేపు అనగా శుక్రవారం...
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట దర్శకుడు పరశురాం మీడియాతో ముచ్చటించారు. పరశురాం పంచుకున్న సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ సంగతులివి. సర్కారువారి పాట ఘన విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ? సినిమా విజయం సాధించిన తర్వాత మహేష్ బాబు గారి దగ్గర నుండి వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి ? ‘సర్కారు వారి పాట’ కథ అనుకున్నప్పుడే మహేష్ బాబు గారి కెరీర్ లో పెద్ద హిట్ అవ్వాలని భావించాం. దానికి తగ్గట్టే క్యారెక్టర్, మేనరిజమ్స్, లుక్స్ డిజైన్ చేశాం. మేము ఊహించినట్లే సినిమా ఘన విజయం సాధించింది. కొత్త మహేష్ బాబుని చూస్తున్నామనే ఫీడ్ బ్యాక్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి వచ్చింది. సినిమా ఇంతపెద్ద ఘన విజయం సాధించినందుకు చాలా ఆనందంగా వుంది. రిలీజ్ రోజు మార్నింగ్ మహేష్ బాబు గారు కాల్ చేసి.. ”అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. కంగ్రాట్స్”అని ఆయనే రివర్స్ లో కంగ్రాట్స్ చెప్పారు. నేను ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డానో మహేష్ గారికి తెలుసు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం ఆనందంగా వుంది. ఇండస్ట్రీ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్, పూరి గారు కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ”నేను అయితే ఇంతహెవీ కథని ఇంత లైటర్ వెయిన్ లో వినోదాత్మకంగా ట్రీట్ చేయలేను. ఇది నీ ఒక్కడికే సాధ్యం” అని సుకుమార్ అన్నారు.స్పెషల్ గా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ దగ్గర నుండి భారీ స్పందన వచ్చింది. ఫ్యాన్స్ ఫోన్ చేసి” మహేష్ బాబు గారిని ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు. అద్భుతంగా చూపించారు”అని ఆనందపడ్డారు. ఇంత హెవీ స్టొరీని లైటర్ వెయిన్ చెప్పిసినట్లు మీకు అనిపించలేదా ?ఒకొక్కరిది ఒక్కో స్టయిల్. థియేటర్ లోకి వచ్చిన వారిని ఆహ్లాదపరుస్తూ చెప్పాలనుకున్న పాయింట్ ని చెప్పడం నాకు ఇష్టమైన స్టయిల్. ప్రేక్షకులు నవ్వాలి. ఆనందంగా వుండాలి. మనం చెప్పాలనుకున్న పాయింట్ కూడా చెప్పాలి. ఇదే నాకిష్టం. సర్కారు వారి పాటకు రిపీట్ ఆడియన్స్ రావడానికి కారణం కూడా సినిమాలో వున్న వినోదమే. బాక్సాఫీసు నెంబర్స్ చూస్తే కిక్ వస్తుందా ? లేదా మంచి సినిమా తీశామనే కిక్కుందా ?సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని డైరెక్ట్ చేశాననేది నా మొదటి కిక్కు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం సెకండ్ కిక్. మహేష్ గారిని కొత్తగా చూపించారని ఫ్యాన్స్ ఆనందపడటం థర్డ్ కిక్. ఇక బాక్సాఫీసు నెంబర్లు అంటే అది మహేష్ గారికి వున్న స్టార్ డమ్.. కథ జనాల్లోకి చొచ్చుకు వెళ్ళడం… రెండో వారం వస్తుంది… ఇప్పటికీ అద్భుమైన షేర్స్ లో వుంది సర్కారు వారి పాట. సర్కారు వారి పాట కథ కంటే మహేష్ బాబు గారి క్యారెక్టర్ పైనే ఎక్కువ ద్రుష్టిపెట్టారనే విమర్శ గురించి ఏం చెప్తారు? క్యారెక్టర్ ఎంత కొత్తగా చేసినా కథ బలంగా లేకపోతే ఒక స్టార్ హీరో ఓకే చేయరు. సర్కారు వారి పాట కథ చాలా కొత్త పాయింట్. ఇలాంటి కథతో గతంలో ఎలాంటి సినిమా రాలేదు. మహేష్ గారు ఈ కథ ఓకే చేయడానికి కారణం కథే. ప్రతి సామాన్యుడు కష్టపడి బ్యాంక్ నుండి తీసుకున్న అప్పుని వడ్డీ అణాపైసాలతో సహా తిరిగి చెల్లిస్తున్నాడు. కానీ కొందరు కోట్ల రుపాయిలు తీసుకొని ఎందుకు కట్టడంలేదు .....
ఎఫ్ 3.. పక్కా ఫైసా వసూల్ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే… మూడు వందల రూపాయల...
సంపూర్ణేష్ బాబు గారు ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే ఈ సినిమా ఒక ఎత్తు.ఈ సినిమా...