మిలియన్ వ్యూస్ దాటేసిన "పుష్పక విమానం" చిత్రంలోని 'కళ్యాణం' లిరికల్ సాంగ్

మిలియన్ వ్యూస్ దాటేసిన “పుష్పక విమానం” చిత్రంలోని ‘కళ్యాణం’ లిరికల్ సాంగ్*

ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా “పుష్పక విమానం” నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ ఫీట్ సాధించింది. సమంత విడదల చేసిన ఈ పాట పది లక్షలకు పైగా వ్యూస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘కళ్యాణం..’ పాట చాలా బాగుందంటూ విన్న ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు వస్తున్నాయి. వివాహ వేడుకల నేపథ్యంగా వచ్చే ‘కళ్యాణం..’ పాట..ఇప్పడున్న పెళ్లిల్ల సీజన్ లో మార్మోగుతోంది. రామ్ మిరియాల బ్యుటిఫుల్ గా కంపోజ్ చేసిన ఈ పాటను మంగ్లీ, సిధ్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. పెళ్లిని అంకెలతో పోల్చూతూ అద్భుతంగా రాశారు గీత రచయిత కాసర్ల శ్యాం. వీళ్ల ఎఫర్ట్ పాటకొస్తున్న ఆదరణలో కనిపిస్తోంది. ‘కళ్యాణం..’ లిరికల్ సాంగ్ ఫాస్ట్ గా వన్ మిలియన్ రీచ్ అవడం చూస్తుంటే…ఈ పాట అతి త్వరలో ఇంకెంతో మంది శ్రోతలకు చేరుతుందని స్పష్టంగా తెలుస్తోంది.

“పుష్పక విమానం” చిత్రంలో ఆనంద్ దేవరకొండ సరసన గీత్ సైని నాయికగా నటిస్తోంది. నూతన దర్శకుడు దామోదర రూపొందిస్తున్నారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్నారు. ‘కింగ్ అఫ్ ది హిల్’ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది “పుష్పక విమానం”.

నటీనటులు – ఆనంద్ దేవరకొండ , గీత్ సైని, శాన్వి మేఘన, సునీల్, నరేష్, హర్షవర్థన్, గిరిధర్, కిరీటి, భద్రం, వైవా హర్ష, అభిజిత్, అజయ్, సుదర్శన్, శరణ్య, మీనా వాసు, షేకింగ్ శేషు తదితరులు

సాంకేతిక నిపుణులు – సమర్పణ : విజయ్ దేవరకొండ, పి.ఆర్.వో: జి.ఎస్.కె మీడియా,  సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, ఎడిటర్ : రవితేజ గిరిజాల, మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని, నేపథ్య సంగీతం : మార్క్ కె.రాబిన్, కాస్టూమ్స్ : భరత్ గాంధీ, నిర్మాతలు:  గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి , ప్రదీప్ ఎర్రబెల్లి, రచన-దర్శకత్వం: దామోదర