వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో సుధాకర్ ఇంపెక్స్ పతాకంపై డా. రాజశేఖర్ హీరోగా ప్రకాష్ రాజ్,శివాని, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం “శేఖర్”. ఈ చిత్రం ఈ నెల 20 న విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతూ హిట్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా చిత్ర నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..
మాది కర్నూల్ జిల్లా నంద్యాల దగ్గర టంగుటూరు అనే చిన్న పల్లెటూరు.మా ఫ్యామిలీ అంతా కోర్ట్ ఎంప్లొయ్స్.నా చదువు అయిపోయిన తరువాత హైదరాబాద్ వచ్చినపుడు మా అంకుల్ రంగారెడ్డి జిల్లా జడ్జిగా ఉండేవాడు. అయినా నేను ఎవరి దగ్గరకు వెళ్లకుండా 1993 లో జనప్రియ సిండికేట్ లో జాబ్ చేస్తూ కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది.ఆ తరువాత సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఎక్స్పోర్ట్ కంపెనీ ను స్టార్ట్ చేశాను.ఆఫ్రికాలోని నైజీరియా, బెనినో, హైవేరీ లో లిక్కర్ యూనిట్ లకు ఇక్కడి నుండి ఫుడ్ ఫ్లేవర్స్ ఇతనాల్ వంటివి కంపెనీ ద్వారా ఎక్స్ పోర్ట్ చేయడం జరిగేది.అలాగే ట్రాన్సిస్ట్ కోసం దుబాయ్ లో కూడా కంపెనీ పెట్టా..ఇలా బిజినెస్ పరంగా అంచెలంచెలుగా ఎదగడం జరిగింది.
బొగ్గారం శ్రీనివాస్ తో చాలా సంవత్సరాలు గా జర్నీ చేస్తున్నాను.అయితే కార్తికేయ సినిమా నుంచి ఇన్వెస్టర్ గా తనతో జర్నీ చేస్తున్నాను.కార్తికేయ రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అయ్యింది. తరువాత కథలో రాజకుమారి సినిమాకు ఇన్వెస్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్ శ్రీనివాస్ కు హెల్త్ సిక్ అయ్యినందున ఆ సినిమాను నేనే రిలీజ్ చేశాను. అప్పుడే అక్కడ సుబ్రహ్మణ్యపురం దర్శకుడు కథ చెప్పడంతో నాకు ఆ కథకు కొంత సెంటిమెంట్ ఉన్న కారణంగా ఆ సినిమాను నిర్మించడం జరిగింది.ఆ తరువాత శ్రీనివాస్ గారికి హెల్త్ సెట్ అయిన తరువాత బొగ్గారం శ్రీనివాస్ తో ట్రావెల్ అవుతూ సినిమాలకు ఇన్వెస్ట్ చేస్తున్నాను.
రాజశేఖర్ నా చిన్నప్పటి ఫెవరేట్ హీరో తనంటే నాకు ఎంతో ఇష్టం గరుడవేగ సినిమాకు తనతో జర్నీ చేశాను.ఆ పరిచయంతో వారు మళ్లీ సినిమా చేద్దామని చెప్పారు.మేము చేసిన రీమేక్ సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. జోసెఫ్ సినిమా బాగుంది చేద్దామని జీవిత రాజశేఖర్ లు చెప్పడంతో.. కోవిడ్ టైం లో దుబాయ్ లో ఉన్న నేను మలయాళం జోసెఫ్ సినిమా చూడడం జరిగింది.ఆ సినిమా నాకు బాగా నచ్చింది. ఇది మలయాళం సినిమా కదా తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా లేదా అనుకున్నాం.అయితే చూసిన ప్రేక్షకులందరూ క్లైమాక్స్ అదిరిపోయింది రాజశేఖర్ గారు ఆడియన్స్ మంచి మెసేజ్ ఇచ్చారు అని చెప్పడంతో మాకు చాలా సంతోషం వేసింది.మా సినిమాను రిసీవ్ చేసుకొని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు.
ఈ సినిమాను తెలుగు,కన్నడ రాష్ట్రాల్లో 300 థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే విడుదల చేసిన అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వొస్తుంది.
ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్.. అనూప్ రూబెన్స్ మ్యాజిక్ చేయడంతో సినిమాకు 40% హైప్ వచ్చింది.రాజశేఖర్ నటనతో పాటు మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు. అందుకే సినిమా చాలా బాగా వచ్చింది.
ఈ సినిమాలో రాజశేఖర్ కూతురి పాత్రకు శివానీ అయితే ప్రేక్షకులు కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అని శివాని ని సెలెక్ట్ చేయడం జరిగింది. మేమంతా ఆనుకున్నట్లే శివాని చాలా బాగా నటించింది. ప్రేక్షకులనుండి హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది.
మంచి మెసేజ్ ఉన్న ఈ చిత్రాన్ని థియేటర్ లో రిలీజ్ చేద్దామనే తీశాము తప్ప ఓటిటి కని ఈ సినిమా తీయలేదు. జీవిత మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండడంతో దర్శకురాలిగా తనైతే కరెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ ను జీవిత గారికే అప్పజెప్పడం జరిగింది.ఈ సినిమా కు వారంతా చాలా కష్టపడ్డారు. వారి కష్టానికి మాకు ఫలితం దక్కింది ఆనుకుంటున్నాను.
నాకు బీరం పుల్లారెడ్డి అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము.అందుకు గాను నాకు లాస్ట్ మంత్ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. దుబాయ్ లో కూడా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను.కోవిడ్ టైం లో చాలా మందిని ఎయిర్ ఇండియా ద్వారా పంపియ్యడం జరిగింది.
నాకు సినిమానే ప్రొఫెషన్ కాదు. నాకున్న బిజినెస్ లు చూసుకుంటూ ఇండస్ట్రీ లో నాకున్న చాలా మంది ఫ్రెండ్స్ సినిమాలకు నేను ఇన్వెస్ట్ చేస్తాను తప్ప నిర్మాత గా మారి సినిమా చేసే ఆలోచనలేదు.కార్తికేయ నుండి ఇప్పటివరకు సుమారు 15 సినిమాలకు ఇన్వెస్ట్ చేయడం జరిగింది అని ముగించారు.