హృషీకేష క్రియేషన్స్, బీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్, శ్రావ్య (తొలిపరిచయం) జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి  లక్ష్మీనారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఉత్తమ విలన్” కేరాఫ్ మహాదేవపురం. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంతుంది. సందర్భంగా ఈ చిత్ర టీజర్ ను నటుడు మంచు మనోజ్ విడుదల చేశారు. అనంతరం

నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ..”ఉత్తమ విలన్” టీజర్ బాగుంది.లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు పక్కా కమర్షియల్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని రాజారెడ్డి పానుగంటి తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. నటీనటులు అందరూ చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు

చిత్ర నిర్మాతలు .మాట్లాడుతూ.. మంచు మనోజ్ గారు ఎంతో బిజీ గా ఉన్నా మా చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. వారికి మా చిత్ర యూనిట్ తరుపున ధన్యవాదాలు. ఇటీవలే
షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ “ఉత్తమ విలన్” చిత్రం అందరినీ అలరిస్తుంది అని అన్నారు

చిత్ర దర్శకుడు రాజారెడ్డి పానుగంటి మాట్లాడుతూ..సినిమా చాలా బాగా వచ్చింది.దుబాయ్ షూట్ లో,  కొండమడుగు ఊరిలో షూటింగ్ చెయ్యడం జరిగింది. ప్రొడ్యూసర్స్ సాయి, శ్రావణ్ లు ఈ మూవీ కొరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా  ఏం కావాలంటే అది కాదనకుండా అన్ని సమకూరుస్తూ ఈ చిత్రం ఒక రేంజ్ లో రావడానికి కారణమయ్యారు. ఈ చిత్రానికి సహకరించిన నటీనటులకు, డైరెక్షన్ , టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ అందరికీ థాంక్స్  చెప్పారు..

జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ…ఈ సినిమాలో నా క్యారెక్టర్ కామెడీ అల్టిమేట్ ఉంటుంది.మిగతా అందరు కొత్త వారైనా గానీ  చాలా బాగా పర్ఫామెన్స్ చేశారు.ప్రొడ్యూసర్  సాయి , శ్రావణ్ లకు ఈ సినిమా బాగా ఆడి చాలా డబ్బులు రావాలని అన్నారు

హీరో విజయ్ మాట్లాడుతూ.. దర్శకుడు పానుగంటి గారు పని రాక్షసుడు మేము కొత్త వారిమైనా సరైన ఔట్ ఫుట్ వచ్చే వరకు మాతో యాక్ట్ చేయించాడు. తల్లిదండ్రులు జన్మనిస్తే సాయి శ్రావణ్ ఇద్దరూ కలిసి నాకు పునర్జన్మ ఇచ్చారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అని అన్నారు.

హీరోయిన్ శ్రావ్య మాట్లాడుతూ.. నాకిది తొలి చిత్రం. ఉత్తమ విలన్ వంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు.              
జబర్దస్త్ అప్పారావు బాబురావు సాయి, హరీషు  శ్రావ్య  (సక్కు) రాజు.  విజయ,ఆసిఫ్ అన్న.   రామానాయుడు నీలిమ,  శ్రవణ్,  మల్లి మామ, హుస్సేన్,మురళి.

సాంకేతిక నిపుణులు-
ప్రొడ్యూసర్స్  – వి సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి. శ్రవణ్ కుమార్.
డైరెక్టర్ – రాజారెడ్డి పానుగంటి,
సంగీతం – శౌరీ, జాన్,
డాన్స- మురళి
ఎడిటర్ –  గుణశేఖర్
డబ్బింగ్  – రాజ్ కుమార్,అన్విక స్టూడియోస్
పి ఆర్ ఓ –   మధు. వి.ఆర్