తానా ప్రపంచ సాహిత్య వేదిక మరియు సిరివెన్నెల కుటంబం సంయుక్తంగా శిల్ప కళా వేదికలో రేపు అనగా శుక్రవారం మే 20 వ తేదీ సాయంత్రం 5.25 నిమిషాలకు ప్రారంభమవుతాయి.
ఈ సందర్భంగా “ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్య సంపుటి – 1” పుస్తకావిష్కరణ భారతదేశ మాన్య ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి సువర్ణ హస్తాలతో జరుగుతుంది. తొలి ప్రతిని శ్రీమతి పద్మావతి సీతారామశాస్త్రి గారు అందుకుంటారు. పుస్తక పరిచయాన్ని గౌ. బ్రహాశ్రీ గరికిపాటి నరసింహారావు గారు చేస్తారు. సుప్రసిద్ధ దర్శకులు శ్రీ త్రివిక్రం శ్రీనివాస్ గారు, తానా అధ్యక్షులు శ్రీ లావు ధనుంజయ చౌదరి గారు, తానా ప్రపంచ సాహిత్య వేదిక అధ్యక్షులు , మరియు ఈ ఉత్సవ నిర్వాహక కమిటీ అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ గారు విశిష్ట అతిథులుగా పాల్గొంటారు.
ఈ వేడుక లో సాహితీ ప్రియులు శ్రీ మండలి బుధ్ధ ప్రసాద్ గారు, సినీ కవులు శ్రీ జొన్నవిత్తుల,. శ్రీ భువనచంద్ర, శ్రీ చంద్రబోస్, శ్రీ రామజోగయ్య శాస్త్రి, శ్రీ అనంత శ్రీరాం, శ్రీ సుద్దాల అశోక్ తేజ, సంగీత దర్శకులు శ్రీ కీరవాణి, శ్రీ తమన్, శ్రీ ఆర్.పి. పట్నాయక్ మరియు ప్రముఖ దర్శకులు శ్రీ కృష్ణవంశి, శ్రీ క్రిష్ తదితర ప్రముఖులు పాల్గొంటారు.

సి. శ్రీరామ శర్మ
(సీతారామశాస్త్రి గారి సోదరులు)