హైదరాబాద్
దిశ ఎన్‌కౌంటర్ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పుదిశ ఎన్‌కౌంటర్ కేసుపై రేపు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. దిశ ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు సిర్పూర్ కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కోర్టు కేసును సుదీర్ఘ విచారణ చేసి జనవరిలో సుప్రీంకోర్టుకు కమిటీ నివేదికను అందజేసింది. సిర్పూర్ కర్ కమిషన్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసింది. ఎన్‌కౌంటర్‌లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందిని కమిషన్ విచారించింది. విచారణ చేసిన కమిషన్ బాధిత దిశ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసి నివేదికను సుప్రీంకోర్టుకి అందజేసింది..