గోల్ఫ్ లో 1 బంగారు, 2 రజత పతకాలను సాధించిన గౌలి దొడ్డిలోని గురుకుల కళాశాల కు చెందిన అఖిల(గోల్డ్),అనూష(సిల్వర్),అమూల్యలు (సిల్వర్)లు సాధించినందుకు గాను ఈరోజు మర్యాదపూర్వకంగా సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., కలిశారు.
విద్యార్థినులు పతకాలు సాధించడంపై సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., హర్షం వ్యక్తం చేశారు.
గురుకులాల నుంచి పతాకాలు సాధించిన ఈ విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ రామ్ లక్ష్మణ్, ఫిజికల్ డైరెక్టర్ కె. సత్యనారాయణ, గోల్ఫ్ ప్రొఫెషనల్ కోచ్ భాస్కర్ ఎస్, నిరంతరం కృషి చేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని సీపీ అభినందించారు.
గోల్ఫ్ ప్రొఫెషనల్ కోచ్ భాస్కర్ ఎస్ మాట్లాడుతూ.. బెంగళూరులోని ASC centre లో మే 8,9,10 వ తేదీల్లో నిర్వహించిన ఐజీయూ సౌత్ జోన్ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ లో ఈ విద్యార్థినులు గెలుపొందారని తెలిపారు
సాంఘిక సంక్షేమ గురుకులాల హైదరాబాద్ లోని గౌలిదొడ్డిలో ప్రత్యేక గోల్ఫ్ అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. 2019 నుంచి ఈ విద్యార్థినులు అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారన్నరు.అనతికాలంలోనే విద్యార్థినులు గోల్ఫ్ క్రీడలో పట్టు సాధించిండం సంతోషంగా ఉందన్నారు.