కాకినాడ సంతచెరువు సెంటర్ సినిమా రోడ్డు లో వున్న మంత్రి ప్రగడ వారి సత్రం 17వ నెంబర్ షాపు వివాదం పై గురువారం సాయంత్రం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ ఆదేశాల మేరకు ఇన్ స్పెక్టర్లు విచారణ నిర్వహించారు. గొర్ల రాము తన తండ్రి 1950 హయాం నుండి నిర్వాహణలో వున్న దుకాణంకు రెండేళ్ల అద్దె కట్టలేదని ఆ షాపు పై ఇతరుల వద్ద డబ్బు తీసుకున్నాడన్న పిర్యాదుపై సత్రం ఇ వో అతనికి షాపు లేకుండా తాళాలు వేయడం ఆక్షన్ నోటీస్ ప్రకటించి గోప్యంగా చేపట్టడం షాపు నిర్వాహకుని సామాన్లు తరలించడం అద్దె బకాయి డిడి స్వీకరించకుండా గొర్ల రాము ను బెదిరించి సంతకాలు తీసుకున్నా రన్న ఆరోపణలపై గత వారం స్పందన పిర్యాదు లో దాఖలైన వినతి పై కలెక్టర్ కృతిక్ శుక్లా స్పందించి దేవాదాయ దాయ శాఖ ఎ సి ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ తదితర సిబ్బంది మంత్రి ప్రగడ సత్రం షాపు నంబర్ 17వద్ద విచారణ నిర్వహించారు. వీరి నివేదిక ఆధారంగా దేవాదాయ శాఖ ఆర్ జె సి తుది చర్యలు వహించే అవకాశం వుంది. గొర్ల రాము తన బకాయి ని పెనాల్టీ తో చెల్లించుకుని తనకు యథాప్రకారం అందరూ వలె అవకాశం ఇవ్వాలని కోరుతు న్నారు. ప్రయివేటు వ్యక్తులు షాపు తనఖా పై తనకు అప్పు ఇచ్చినట్టుగా చెబుతున్నవారు ఆ నేరాన్ని కోర్టు కి తీసుకు వెళ్లి శిక్షించాలని అలా చేయకుండా దేవాదాయ శాఖ ఇ వో ప్రయివేటు పంచాయితీ పెట్టి దళారులకు అమ్ముకుంటున్న తీరు చట్ట నియమాలకు వ్యతిరేకమని పేర్కొంటున్నారు. అన్యాయం కొనసాగితే న్యాయస్థానం లో వ్యాజ్యం దాఖలు చేస్తానని పేర్కొన్నారు.
మంత్రిప్రగడ వారి సత్రం లో అవినీతి కుట్రలు అక్రమార్జనలు వెలుగు చూస్తాయని రాము పేర్కొన్నారు. దర్యాప్తు చేయించిన కలెక్టర్ కృతికా శుక్లా కు ధన్యవాదాలు తెలిపారు. రాము నగరంలోని తెదేపా బి జెపి బి ఎస్ పి వెల్ఫేర్ పార్టీ జనసేన ఆమ్ ఆద్మీ సి పి ఐ నాయకులను కలిసి తన గోడు చెప్పుకున్నారు. అఖిల పక్ష బృందం కూడా విచారణ తీరు పరిశీలించేందుకు వెళ్ళడం గమనార్హం.