ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఎంతటి వారి నైనా వదిలి పెట్టె పరిస్థితి లేదు
రంగంలో ప్రత్యేక బృందాలు
జిల్లా యస్.పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి.యస్
భారీ మొత్తంలో ఎర్ర చందనం స్వాధీనం
సుమారు 4 కోట్లు విలువైన 3 టన్నుల బరువు గల ఎర్ర చందనం దుంగలు స్వాధీనం
దుంగలను చెన్నైకి చేర్చి ఆపై చైనాకు తరలిస్తున్నట్లు సమాచారం.
ఐదుగురు స్మగ్లర్ల అరెస్ట్… వారిలో ఒకరు మోస్ట్‌వాంటెడ్.
సుమారు 4 కోట్ల విలువైన 3 టన్నుల బరువు గల 191 ఎర్ర చందనం దుంగలు, వాటితో పాటు చిన్న ముక్కలుగా చేసిన ఎర్రచందనం కలిగిన 8 గోనె సంచులు.
పుత్తూరు రూరల్ మండలం వడమాలపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నారాయణవనం పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా యస్.పి శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి, ఐ.పి యస్ గారు కేసు వివరాలను తెలియపరిచారు.
ఈ సందర్భంగా యస్.పి గారు మాట్లాడుతూ ఎర్ర చందనం జాతీయ సంపదని, ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేసే ఎంతటి వారి నైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ఎర్ర చందనం పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, అందుకు అనుగుణంగా తిరుపతి జిల్లా పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఉక్కు పాదంతో తొక్కి వేస్తామని యస్.పి గారు తీవ్రంగా హెచ్చరించారు.
తనకు ముందుగా అందిన సమాచారం మేరకు ఒక ప్రణాళికాబద్ధమైన పటిష్ట వ్యూహరచన చేసి, ఎర్ర చందనాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్న బడా వ్యక్తుల ముఠాను అరెస్టు చేయడమే కాక దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువ చేసే దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అన్నారు.
జిల్లా యస్.పి గారి ఆదేశాల ప్రకారం అడ్మిన్ అడిషనల్ యస్.పి శ్రీమతి ఇ.సుప్రజా గారు పుత్తూరు డిఎస్పీ శ్రీ.టీ.డి యశ్వంత్, వారి ఆధ్వర్యంలో తిరుపతి, నగిరి జాతీయ రహదారి వడమలపేట వద్ద పుత్తూరు సబ్-డివిజన్ ఇన్-ఛార్జ్ డిఎస్పీ శ్రీ డి.కొండయ్య గారి స్వీయపర్య వేక్షణలో పుత్తూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏం.సురేష్ కుమార్, సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.శివ కుమార్ రెడ్డి, వడమాలపేట, పిచ్చాటూరు , K.V.B పురం, నాగలాపురం పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్స్ K.ఈశ్వరయ్య, N.శ్రీకాంత్ రెడ్డి, N.నాగార్జున రెడ్డి, ప్రతాప్ మరియు సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు.
12-05-2022 వ తేది ఉదయం 5.30 AM గంటలకు వడమాలపేట మండలం, SV పురం టోల్ గేట్ సమీపమున, వనమాలి హోటల్ ఎదురుగా ఉన్న నేషనల్ హైవే బైపాస్ కూడలి వద్ద పుత్తూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ. M.సురేష్ కుమార్, సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ N.శివ కుమార్ రెడ్డి, వడమాలపేట SI E. ఈశ్వరయ్య, HCs రమణారెడ్డి, గంగిరెడ్డి, PCs సోమశేఖర్, శ్యామసుందరం, సత్య, లోకనాధం, జగదీష్ కుమార్, క్రైమ్ పార్టీ సోమశేఖర్, నరేష్ కుమార్, ఉదయ్ కుమార్, దాము, మునెయ్య తదితరులు వాహనాలను తనిఖీ చేస్తుండగా తిరుపతి వైపు నుండి చెన్నై వైపుగా ఒక కారు, దాని వెనుక ఒక మిని Goods carrier వాహనము వస్తూ ఉండి పోలీసులను చూసి సదరు కారు, మినీ Goods carrier లోని వ్యక్తులు సదరు వాహనాలను తిప్పుకొని పారిపోవుటకు ప్రయత్నించగా, పోలీస్ సిబ్బంది చాకచక్యంగా చుట్టుముట్టి పట్టుకొని అయిదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి లగేజీ వాహనంలోని సుమారు 191 ఎర్ర చందనం దుంగలు మరియు 8 గొనెసంచిలలోని చిన్న ముక్కలుగా చేసిన ఎర్ర చందనాన్ని, ఒక Goods carrier (Ashok lay land goods carrier bada dost) వాహనం మరియు Maruthi Suzuki Swift Dezire కారును స్వాధీనము చేసుకోవడమైనది.
విచారణలో బాగంగా A-1 నిందితుడు అయిన సెంథిల్ కుమార్ ని బడా స్మగ్లర్ గా గుర్తించడమైనది. ఇతను బడా స్మగ్లర్లతో సంబంధం కలిగి ఉండి చెన్నై, బెంగుళూరు మీదుగా విదేశాలకు ఎర్ర చందనం ను ఎగుమతి చేసే వారికీ ఎర్ర చందనం సరఫరా చేసేవాడు. ఇన్ని రోజులు పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా తప్పించుకొని తిరుగుతూ ఉండేవాడు. ఈ కేసులో ఇంకా కొంత మంది బడా స్మగ్లర్లను అరెస్ట్ చేయవలసి ఉన్నది. అందు కొరకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేస్తున్నారు.
స్వాధీనము చేసుకోబడిన సొత్తు వివరాలు
191 ఎర్ర చందనం దుంగలు మరియు 8 గొనె సంచిలలోని చిన్న ముక్కలుగా ఉన్న ఎర్ర చందనం, మొత్తం కలిపి వాటి బరువు సుమారు 3 టన్నులు.
ఒక Ashok lay land goods carrier bada dost వాహనం, దాని రిజిస్ట్రేషన్ నెంబరు.TN03AC7124,
ఒక Maruthi Suzuki swift Dezire కారు, నెంబరు.TN81A9640.
అరెస్టైన స్మగ్లర్ల యొక్క వివరములు:–
- కరుపయ్య.సెంథిల్ కుమార్, వయసు. 42 సం, తండ్రి పేరు: ఆర్.యామ్. కరుపయ్య, నివాసం D.No.27/5, తిరుమయం పొన్నర్వతి రోడ్, వ్రాచెలి విలేజ్ , తిరుమయం తాలూకా, పుదుకొటై డిస్ట్రిక్ట్, తమిళనాడు రాష్ట్రం.
- దేవన్.నాగరాజు, వయస్సు : 44 సం.రాలు, తండ్రి : లేట్ కాశీ.దేవన్, నివాసము D.No. 20/29, పెరుమాళ్ కోయిల్ స్ట్రీట్, ఎరన్నవూరు, చెన్నై – 600057.
- వైధ్యలింగం.సారంగపాణి, వయస్సు : 64 సం.రాలు, తండ్రి: లేట్ పి.వైధ్యలింగం, నివాసము D.No. 1/488, 1st స్ట్రీట్, జ్యోతి నగర్, పాడియా నల్లూర్, రెడ్ హీల్స్, చెన్నై – 600052, తమిళనాడు రాష్ట్రం.
- కె.నజీర్ బాషా, వయస్సు:54 సం.రాలు, తండ్రి: లేట్ యామ్.ఖాదర్ బాష, నివాసం D.No.2/1, ఉలగనాధపురం , 7th స్ట్రీట్, తలకుప్పం, ఎన్నురు, చెన్నై – 600057, తమిళనాడు రాష్ట్రం.
- నన్నీ.ముత్తురామన్, వయస్సు:50 సం.రాలు, తండ్రి : లేట్ యస్. నన్నీ , D.No.14/2, మెలవయిల్ గ్రామం, వ్రాచెలై పోస్ట్, తిరుమయం తాలూకా, పుడుకొటై జిల్లా, తమిళనాడు రాష్ట్రం. స్మగ్లర్లను అరెస్ట్ చేసి ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకోవడం లో ప్రతిబ కనపరిచిన పై సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్.పి. అబినధించి రివాడ్లు ప్రకటించినారు. ఈ ఆపరేషన్ నందు పాల్గొన్న పుత్తూరు సబ్-డివిజన్ అధికారులు మరియు సిబ్బంది యొక్క వివరాలు:–
CI Sri M.Suresh Kumar Puttur Rural Circle
Ci Sri N.Siva Kumar Reddy Sathyavedu Circle
SI Sri K.Eswaraiah Vadamalapeta PS
SI Sri N.Srikantha Reddy Pichatur PS
SI Sri N.Nagarjuna reddy K.V.B. Puram PS
SI Sri Prathap Nagalapuram PS
HC 1563 C.V. Ramana Reddy Vadamalapeta PS
HC 1913 T Gangireddy Vadamalapeta PS
PC 1029 N. Somasekahr Vadamalapeta PS
PC 391 B Syamsundaram Vadamalapeta PS
PC 1741 N Sathya Vadamalapeta PS
PC 1805 P. Jagadeesh kumar Vadamalapeta PS
PC 1042 M. Lokanadham Vadamalapeta PS
PC 1569 T.Vasu, Vadamalapeta PS
PC 4399 S.Naresh Kumar K.V.B Puram PS
PC 4165 N.Munnaiah K.V.B. Puram PS
PC 4381 A.Udaygiri Pichatur PS
PC – Raghu Nagalapuram PS
PC – Devendra Naik Sathyavedu PS
PC 2598 STF, Tirupai
PC 2609 STF Tirupati
PC 2615 Hemanth STF Tirupati
HG – Chandra Pandiyan Sathyavedu