పలనాడు జిల్లా వినుకొండ

పట్టణాలలో గల లాడ్జీలు అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా నడుపుతూ బరితెగిస్తున్నాయి. పలు సెటిల్‌మెంట్లతో పాటు వివిధ రకాల కుట్రలు, వ్యభిచారం, పేకాట, మందు సేవించడం తదితర అసాంఘీక కార్యకలాపాలు లాడ్జీలలో స్వైర విహారం చేస్తున్నాయి. కొన్ని నెలలుగా అధికారుల పర్యవేక్షణాలోపం, నిఘా, ఆకస్మిక తనిఖీల లోపాలతో లాడ్జీల నిర్వాహకుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.
లాడ్జీలలో పలు బెట్టింగ్‌లతో పాటు విందు, పొందులు జోరుగా నడుస్తున్నట్టు సమాచారం.
దీంతో పట్టణ సీఐ బి అశోక్ బాబు ఆధ్వర్యంలో శనివారం రాత్రి పలు లాడ్జి లపై ఆకస్మిక తనిఖీలు జరిపి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది.
ఇకనుండి లాడ్జీలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కొరడా ఝుళిపించనున్న CI B. అశోక్ బాబు.ఎస్సై. చేన్నకేశవులు