విక్రాంత్ హీరోగా ప‌రిచ‌యం చేస్తూ హై బ‌డ్జెట్‌తో డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై ‘స్పార్క్’ చిత్రం శుక్ర‌వారం రోజున హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్, MP రంజిత్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రత్నవేలు, అన్వేష్ రెడ్డి, పారిశ్రామికవేత్త రామరాజు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

 మెహ‌రీన్ ఫిర్జాదా .. స్పార్క్ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, సత్య, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అన్నపూర్ణమ్మతో పాటు టాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న ఆర్టిస్టులు చాలా మంది నటిస్తున్నారు.

సినిమాటోగ్రాఫర్‌ అరవింద్‌ కుమార్‌ రవివర్మ ‘స్పార్క్’ చిత్రంతో డైరక్టర్‌గా పరిచయమవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరక్షన్‌ చేస్తూనే, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు అరవింద్ కుమార్ వర్మ. రత్నవేల్‌ దగ్గర అసోసియేట్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు అరవింద్‌ కుమార్‌ రవివర్మ. శంకర్‌ – సుకుమార్‌ దగ్గర  సినిమాలు చేసి దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నారు. దాదాపు 400కి పైగా యాడ్స్ చేసిన అనుభవం ఆయన సొంతం.

‘స్పార్క్’ సినిమాకు సెన్సేషనల్‌  మ్యూజిక్‌ డైరక్టర్‌ స్వరాలు సమకూర్చనున్నారు.  సాంకేతిక నిపుణులను పరిచయం చేసేటప్పుడు మ్యూజిక్‌ డైరక్టర్‌ పేరును ఘనంగా పరిచయం చేయాలన్నది మేకర్స్ ప్లాన్‌. మూవీ  ఫస్ట్ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లోనూ, హైదరాబాద్‌ పరిసరాల్లోనూ ప్లాన్‌ చేశారు. వైజాగ్‌, డార్జిలింగ్‌, ముంబై, గోవాలో మిగిలిన షెడ్యూళ్లుంటాయి. ఫారిన్‌ లొకేషన్లలోనూ షూటింగ్‌ ఉంటుంది. ఈ వైవిధ్యమైన ప్రాజెక్ట్ కి ఆల్రెడీ  ఆల్‌  క్రాఫ్ట్స్‌లో పాజిటివ్‌ బజ్‌ క్రియేట్ అయ్యింది.