ప్రముఖ సంస్థ సాప్ బ్రో గ్రూప్‌కు చెందిన సాబ్రో ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్‌పై సప్పాని బ్రదర్స్‌గా పాపులర్ అయిన తులసీ రామ్ సప్పాని, షణ్ముగం సప్పాని నిర్మిస్తోన్న పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ ‘శాసన సభ’. వేణు మడికంటి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇంద్ర సేన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రకటనను శనివారం విడుదల చేశారు. అందులో భాగంగా పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ను గమనిస్తే అందులో ఖాళీ అసెంబ్లీ కనిపిస్తుంది. అందులో రాజకీయ నాయకుడు ఏదో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. లోగోను గమనిస్తే లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్డింగ్‌ను సూచిస్తుంది.
ఈ సినిమా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ఉండే సభ ఎలా పనిచేస్తుంనదే విషయాన్ని తెలియజేస్తూనే మనలో ఆలోచనలను రేకెత్తిస్తాయి.
ప్రస్తుతం ఉన్న సమకాలీన రాజకీయ రాజకీయాలపై సమాజ స్థితిగతులను సూచిస్తూనే చాలా ముఖ్యమైన మెసేజ్ ఇచ్చేలా సినిమా ఉంటుంది. రేసీ పొలిటికల్ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నామని చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రూపొందనుంది. కె.జి.యఫ్, సలార్ చిత్రాల సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు.
ఐశ్వర్యా రాజ్ భకుని హీరోయిన్‌గా నటిస్తుంది. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్, జబర్దస్త్ అప్పారావు, అనీష్ కురువిల్లా, అమిత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
నటీనటులు:
ఇంద్ర సేన, ఐశ్వర్యా రాజ్ భకుని, రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్, జబర్దస్త్ అప్పారావు, అనీష్ కురువిల్లా, అమిత్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: సాబ్రో ప్రొడక్షన్ ప్రై.లి
నిర్మాతలు : తులసీ రామ్ సప్పాని, షణ్ముగం సప్పాని
దర్శకత్వం : వేణు మడికంటి
సినిమాటోగ్రఫీ : కృష్ణ మురళి
సంగీతం : రవి బస్రూర్
ఎడిటింగ్ : గౌతమ్ రాజు
డైలాగ్స్ : కె.రాఘవేంద్ర రెడ్డి
కొరియోగ్రఫీ : నిక్సన్ మాస్టర్, ప్రేమ్ రక్షిత్
ఆర్ట్: కె.వి.రమణ
పబ్లిసిటీ డిజైన్స్ : కానీ స్టూడియో