భర్త మరణానికి కారకులైన అతని భార్య ఆమె ప్రియుడు లను 2 వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు .రెండో పట్టణ సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు నగరంలోని చాణక్యపురి కాలనీ ఒకటో రోడ్డు ప్రాంతానికి చెందిన పెరుమళ్ళ సంతోష్30 కు రామకుమారి కి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం కలరు, సంతోష్ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో రామ కుమారి స్థానికంగా ఉండే పెంట రూప గోవిందు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. విషయం తెలిసిన భర్త ఆమెను పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ భర్త ఉండగానే అతనితో చనువుగా ఉండడం మొదలు పెట్టింది. మార్చి 29వ తేదీన అతను బయట నుండి ఇంటికి వచ్చే సమయానికి రామకుమారి అతని ప్రియుడు గోవిందు ఇద్దరు ఏకాంతంగా ఉండడాన్ని అతను గుర్తించాడు, పలుమార్లు వారు చెప్పినా వినకుండా ఇలా చేస్తున్నారని తన మరణానికి వీరే కారణం అని, తన తల్లిదండ్రులకు చెప్పి అదే రోజు సాయంత్రం ఇంటి వద్దనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి భర్త ఆత్మహత్యకు కారకులైన అతని భార్య ఆమె ప్రియుడు లను శుక్రవారం సాయంత్రం ఎస్సై కిషోర్ బాబు అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారు.