‘‘వెండితెరపై తన నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు తనదైన సామాజిక సేవా కార్యక్రమాలతో మహోన్నత వ్యక్తిగా పేరుపొందిన మెగాస్టార్‌ చిరంజీవి గారు  మా ‘శుభగృహ’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాడిసర్‌గా వుండేందుకు ఒప్పుకోవడం మాకు ఎంతో ఆనందంగా, గర్వంగా వుందని శుభగృహ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చైర్మన్‌ నంబూరు కళ్యాణ్‌చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ అందమైన ఊహకు  పొందికైన రూపం’ అంటూ లక్షలాది మంది కస్టమర్లకు చేరువైన మా సంస్థకు మెగాస్టార్‌ చిరంజీవి గారి లాంటి గొప్ప వ్యక్తి ప్రచారకర్తగా వుండటం ఎంతో సంతోషంగా వుంది. ‘పుష్ప’ చిత్రంతో భారతదేశం గర్వించదగ్గ దర్శకుల జాబితాలో చేరిన జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ గారి దర్శకత్వంలో, నట శిఖరం
చిరంజీవి గారు నటించగా, ఇటీవల మా సంస్థకు ఓ యాడ్‌ షూట్‌ చేశాం. ఈ ప్రచార చిత్రం అవుట్‌పుట్‌ చూసిన తరువాత చిరంజీవి గారు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. సుకుమార్‌ గారి దర్శకత్వ ప్రతిభతో ఆ యాడ్‌ ఎంతో అద్భుతంగా వచ్చింది. ఈ ఉగాది పర్వదినం నుండి ఈ ప్రచార చిత్రం అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం కానుంది. చిరంజీవి గారు మా సంస్థకు ప్రచారకర్తగా వుండటంతో పాటు ఉగాది పర్వదినాన ప్రసార కానున్న ప్రచారం చిత్రం మా సంస్థ ప్రతిష్టను ఎంతో పెంచుతుంది’ అన్నారు.