రాజ్ భవన్ – విజయవాడ
పత్రికా ప్రకటన

శుభాలను నాందిగా శుభకృత్ నామ సంవత్సరం

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆకాంక్ష

శ్రీ శుభకృత్ నామ సంవత్సరాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాలను నాంది వాచకంగా నిలవాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆకాంక్షించారు. ఉగాది సందేశాన్ని అందించిన గవర్నర్, తెలుగు సంవత్సరానికి ఆదిగా భావించే సంతోషకరమైన, పవిత్రమైన “ఉగాది” సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అందించారు. “ఉగాది” ఆనందం, ఆశల కలయికగా అందరికీ కొత్త ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నారు. ‘శుభకృతు నామ ఉగాది’ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగించాలని గవర్నర్ పేర్కొన్నారు. ఉగాది పచ్చడి ఏడాది పొడవునా జీవితంలో అందించే అన్ని రకాల రుచులను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుందని గౌరవ గవర్నర్ వివరించారు. నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ వృద్ది నమోదు చేయాలని, రైతులతో పాటు సకల వృత్తుల ప్రజలు ఆనందంగా ఉండాలని గవర్నర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించడం ద్వారా ప్రజలు తమను తాము రక్షించుకోవాలని, కరోనా ప్రవర్తన నియమావళి కట్టుబడి దాని వ్యాప్తిని నిరోధించాలని హరి చందన్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.