
నల్గొండలో 12వ షోరూమ్‌ను ప్రారంభించిన మాంగళ్య షాపింగ్ మాల్
టాలీవుడ్ క్వీన్ సమంత, తెలంగాణ ఇందన శాఖా మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు
ముఖ్య అతిధులుగా హాజరై మాల్‌ను ప్రారంభించారు
నల్గొండ, ఫిబ్రవరి 2022 : దేశంలోని ఈ ప్రాంతంలో కుటుంబ యజమాన్యంలోని అతిపెద్ద వస్త్ర సామ్రాజ్యాలలో ఒకటైన
-మాంగళ్య షాపింగ్ మాల్, ఈరోజు నల్గొండలో తన 12వ షాపింగ్ మాల్‌ను ప్రారంభించింది. నల్గొండ నగరంలో ఏర్పాటైన ఈ మెగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాలివుడ్ క్వీన్ సమంత, తెలంగాణ ఇందన శాఖా మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారు హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాంగళ్య షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకులు పి.ఎన్.మూర్తి, మాంగళ్య షాపింగ్ మాల్స్ చైర్మన్ కాసం నమ:శివాయ, మాంగళ్య షాపింగ్ మాల్స్ డైరెక్టర్లు, శ్రీకాసం శివప్రసాద్ Ê పుల్లూరు అరుణ్‌లు కూడా హాజరైనారు.
శ్రీ జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతూ నల్గొండలో మాంగల్య షాపింగ్ మాల్ తమ 12వ షోరూమ్ ను ప్రారంభించడం ఎంతో శుభదాయకమని అన్నారు. 18000 చదరపు అడుగుల సువిశాలమైన విస్తీర్ణంలో అతి పెద్ద మాల్‌ను ఇక్కడ ప్రారంభించడం ఒక కీలక పరిణామని అన్నారు. గతంలో నల్గొండ వాసులంతా పెళ్లి షాపింగ్‌ల కోసం హైదరాబాద్ లేదా విజయవాడ ఇంకా కాంచీపురంలకు కూడా వెళ్లాల్సి వచ్చేదని, అయితే నల్గొండలోనే మాంగళ్య షాపింగ్ మాల్ రావడంతో మీ అభిరుచికి తగ్గట్టుగా కావల్సినవన్నీ ఇక్కడ ఒకే చోట దొరుకుతాయన్నారు. పెళ్లిళ్ళ కోసం, మహిళలు, పురుషులు మరియు పిల్లల కోసం విస్తృతమైన దుస్తుల శ్రేణి మరియు డిజైన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు.
అందాల నటి సమంత మాల్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, మాంగల్య షాపింగ్ మాల్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది మరియు తెలుగు రాష్ట్రాల్లో గొప్ప విజయాన్ని సాధించింది. ఇది ప్రతి ఒక్కరికీ అత్యుత్తమ స్టైల్ ఎంపికలను అందించే సంపూర్ణ కుటుంబ వస్త్రనందనం. మాంగళ్య షాపింగ్ మాల్ అనతికాలంలోనే నాణ్యమైన మరియు మన్నికైన వస్త్రాలకు మారుపేరుగా తెలుగు రాష్ట్రాల్లో ఖ్యాతి గడిరచిందని, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక డిజైన్లను అందుబాటులో ఉంచి వారి మనస్సులను గెలుచుకుందని అన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్‌కు ఇది 12వ స్టోర్ అన్నారు.
తెలుగు రాష్ట్రాలలో ఈ గ్రూపునకు ఇది 12వ షోరూమ్ కాగా, 18000 చదరపు అడుగుల సువిశాల విస్తీర్ణంలో, 4 అంతస్తులలో విస్తరించి ఉన్న ఈ షోరూమ్‌లో ప్రతి ఒక్కరి అభిరుచికి అనుగుణంగా వారికి ఇష్టమైన కలెక్షన్‌లు అందుబాటులో ఉన్నాయని, మహిళల కోసం అనేక వెరైటీల చీరలు, లెహంగాలు, వెస్ట్రన్ వేర్, వెడ్డింగ్ వేర్, డ్రెస్ మెటీరియల్స్ మరియు మరెన్నో అందుబాటులో ఉన్నాయని, పిల్లలు మరియు యువత కోసం పార్టీ దుస్తులు, పండుగ దుస్తులు, రోజువారీ దుస్తులు, మహిళలకు ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ దుస్తులు, కేటలాగ్ చీరలు, పెళ్లి పట్టు వస్త్రాలు, కాంచీపురం పట్టు చీరలు, ఉప్పాడ చీరలు, హై ఫ్యాన్సీ చీరలు, సల్వార్లు, కుర్తా పైజామాలు మరియు వారికి అవసరమైన ప్రతి ఒక్క దాని నుంచి ఎంపిక చేసుకోవచ్చు. పురుషుల కోసం ట్రెండీ ధోతీలు, కుర్తీలు, షర్టులు, టీ`షర్టులు, ప్యాంట్లు, జీన్స్, వివాహ దుస్తులు, పండుగ దుస్తులు మరెన్నో అందుబాటులో ఉన్నాయని, పి యన్ మూర్తి తెలిపారు.
మాంగళ్య షాపింగ్ మాల్‌లో మేము తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాము. తాజాగా నల్గొండలో ఈ నూతన స్టోర్ ప్రారంభంతో తెలుగు రాష్ట్రాలలో మా విస్తరణ పరంపర కొనసాగుతున్నదని కాసం నమ:శివాయ తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో మా కస్టమర్ల భద్రత కోసం మేము అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఇప్పుడు వారు మా మాల్స్‌లో నమ్మకంగా షాపింగ్ చేయవచ్చు. ఈ కష్ట సమయాల్లో మా కస్టమర్లు ఎదుర్కొంటున్న నగదు కొరతను పరిగణనలోకి తీసుకుంటూ, కస్టమర్లు ఉగాది, దసరా,దీపావళి వంటి పండుగలను ఉత్సాహంతో మరియు ఆనందంతో జరుపుకునేందుకు వీలుగా, ఆకర్షణీయమైన ఆఫర్లతో పాటు సరసమైన ధరలతో కూడిన వస్త్ర శ్రేణిని అందుబాటులో ఉంచాము.
మాంగళ్య షాపింగ్‌మాల్ గురించి :
942 సంవత్సరంలో ఒక రిటైల్ ఫ్యాషన్ స్టోర్‌గా ప్రారంభమైన కాసం గ్రూప్‌కు చెందిన మాంగళ్య షాపింగ్ మాల్ 2019 నాటికి కుటుంబ వ్యాపారపు అతిపెద్ద టెక్స్‌టైల్ కింగ్‌డమ్‌గా అవతరించింది. మొత్తం 12 స్టోర్లతో అతిపెద్ద నెట్‌వర్క్‌తో, 7000 మందికి పైగా ఉద్యోగులను కలిగివుండడంతో పాటు మొత్తం స్టోర్లు 3,00,000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణాన్ని కలిగివున్నాయి. తెలంగాణలోని మరే ఇతర వస్త్రశ్రేణి మాల్స్ అందించని రీతిలో మాంగళ్య షాపింగ్‌మాల్ తన కస్టమర్ల యొక్క ఫ్యాషన్ ఆకాంక్షలకు మరియు స్టయిల్స్‌కు అత్యధిక ప్రాధాన్యాతనిస్తూ అన్నింటికిమించి కస్టమర్ల డబ్బుకు తగిన విలువనిస్తూ, అద్బుతమైన కలర్లు మరియు స్టయిల్స్‌లో విస్త్రతశ్రేణికి చెందిన డిజైన్లు మరియు కలెక్షన్లును అత్యంత నాణ్యతగా అందించడంలో తన నిబద్దతను చాటుకుంటున్నది. వివాహ వేడుకుల చీరలకు ప్రసిద్దిగాంచిన మాంగళ్య షాపింగ్ మాల్ మునుపెన్నడూ లేనివిధంగా వివాహా వేడుకల కలెక్షన్ మరియు డిజైన్లను ప్రత్యేకంగా అందిస్తున్నది. మాంగళ్య షాపింగ్‌మాల్ వారి విస్త్రృత శ్రేణికి చెందిన పట్టుచీరలు, డిజైనర్ చీరలు, ఘాగ్రాస్, సల్వార్లు, డ్రస్ మెటీరీయల్స్, వెస్ట్రన్ వేర్ మరియు పురుషులు మరియు పిల్లల కోసం అందిస్తున్న సంపూర్ణ వస్త్రశ్రేణి కస్టమర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.