శ్రీకాంత్ విస్సా వున్నాడనే ఖిలాడి సినిమా చేశా
రాక్ స్టార్‌కు నాకు ఇక గేప్ రాదు
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మించారు. డింపుల్ హయాతి, మీనాక్షిచౌదరి నాయకిలుగా నటించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్ లైన్. హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఖిలాడీ ప్రీరిలీజ్‌వేడుక ఘనంగా జరిగింది. బిగ్ టిక్కెట్‌ను బాబీ ఆవిష్కరించారు.
అనంతరం రవితేజ మాట్లాడుతూ, మొదటిసారి అనసూయ, అర్జున్ గారితో చేశాను. అర్జున్‌గారి ఇన్‌స్పిరేషన్. సినిమా చూస్తే తెలుస్తుంది. టెక్నీషియన్స్ సుజిత్ వాసుదేవన్ అద్భుతంగా చేశాడు. సెకండాఫ్‌లో చాలా సీన్స్ హైలైట్‌గా వుంటాయి. ఈ సినిమా అందంగా చూపించారంటే కారణం జికె విష్ణుగారే.ఈ సినిమా కొత్త కొత్త టెక్నీషియన్‌తో పనిచేశాను. నేను జాతకాన్ని అదృష్టాన్ని నమ్మను. కష్టాన్ని నమ్ముతా. ఏదో ఒకశాతం అది వుంటుంది. రమేష్‌వర్మను చూస్తే జాతకం, అదృష్టం రెండూ కలిసి వచ్చాయనిపిస్తుంది. ఈ సినిమాకు. నిర్మాత కోనేరు సత్యనారాయణగారు అందరినీ ప్రొవెడ్ చేయడమేకాకుండా మొన్ననే రమేష్‌కు కారును బహూకరించారు. అందుకే రమేష్ వర్మ మహర్జాతకుడు.
రాక్ స్టార్ తో గేప్ వచ్చింది. ఇక నుంచి రాదు. ఖిల్ ఖిలాడి సాంగ్.. నా ఫేవరేట్. ముందుగా ఈసినిమా 18 అనుకున్నాం. కానీ అన్నీ పనులు త్వరగా అయ్యాయి. నేను మీలో ఒక్కడిగా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు నచ్చింది కాబట్టి మీకూ నచ్చుతుంది. ఈ సినిమా క్రెడిట్ దక్కాలంటే అది టెక్నీషియన్‌కే దక్కుతుంది. హీరోయిన్లు పెద్ద స్టార్ గా అవుతారనే నమ్మకం వుంది. ఇక సాగర్ హ్యూమర్ గా డైలాగ్‌లు రాశాడు. నేను ఈ సినిమా చేయడానికి కారణం శ్రీకాంత్ విస్సా. తను వున్నాడనే చేశాను. అలాగే తర్వాత కోనేరు గారు మరో కారణం. అందరూ మాస్క్ ధరించి సినిమా చూడండి. జై సినిమా అంటూ ముగించారు.
సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ, రవితేజలో నచ్చింది పాజిటివ్ నెస్. ఇష్టమైన స్టార్. ఇటీవలే బాలకృష్ణ షోకు వెళ్ళారు. రవితేజ చెప్పిన ఒక్కమాట చాలామందికి ఇన్‌సైర్ చేసింది. నేను ఏ పాట చేసినా ఆయన ఎనర్జీని పెట్టుకుని చేస్తాను. ఖిలాడి బ్లాక్ బస్టర్ అవుతుంది. రమేష్ ప్రెజెంటేషన్ బాగుంది. నిర్మాత ఖర్చుపెట్టింంది తెరపై బ్యూటీఫుల్‌గా కనిపిస్తుంది. కొన్ని సీన్లు చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూస్తున్నట్లుంది. దర్శకుడు కథ చెప్పినప్పుడే కొన్ని ట్యూన్ ఆటోమేటిక్‌గా వచ్చేశాయి.నాపై నమ్మకం పెట్టారు. అలాగే పనిచేశాను. హీరోయిన్లకు సమాన స్థాయి పాత్రలు దక్కాయి. అంతా కుటుంబంలా పనిచేశాం. శ్రీమణి సాహిత్యం అద్భుతంగా వచ్చింది అని తెలిపారు.
దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ, రవితేజగారు సినిమా చేయడానికి కథే కారణం. దేవీశ్రీకి అర్థరాత్రి కథ చెప్పాను. కొన్ని సూచనలు కూడా చేశారు. సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. నిర్మాతకు ధన్యవాదాలు తెలియజేశారు.
గీత రచయిత శ్రీమణి మాట్లాడుతూ, మాస్, ప్రేమ, హీరో ఇంట్రో సాంగ్ ఇలా అన్ని రకాల పాటలు రాసే అవకాశం వచ్చింది. ఒకరకంగా ఇలా రాయడం కత్తిమీద సామే. ఈ ఆల్బమ్‌తో ఓ మెట్టు ఎక్కానని చెప్పగలను. ఈ అవకాశం రమేష్ వర్మగారు ఇచ్చారు. ఆయన నాకు కథంతా చెప్పి దేవీశ్రీ దగ్గరకు తీసుకెల్ళారు. ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. రచయిత సాగర్, శ్రీకాంత్ విస్సా మాటలు నాకు పాటల్లో సరైన పదాలు రాయడానికి బాగా హెల్ప్ అయ్యాయని తెలిపారు.
రామారావు ఆన్ డ్యూటీ దర్శకుడు శరత్ మండవ మాట్లాడుతూ, రవితేజగారితో అలవాటు అయితే ఎనర్జీ వస్తుంది. మరో హీరోతో చేయాలంటే కొంచెం పడుతుంది. ఆయన సినిమాకు పనిచేయడం ఆనందంగా వుంది.
టైగర్ నాగేశ్వరరావు దర్శకుడు వంశీ మాట్లాడుతూ, ఖిలాడి ఆల్బమ్ ఇప్పటికే హిట్ అయింది. మాస్ మహరాజా ఎనర్జీ హైలెవల్‌లో వుంటుంది పేర్కొన్నారు.
దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కోనేరు సత్యనారాయణగారు కె.ఎల్. యూనివర్శిటీని అగ్రస్థానంలో నిలిపారు. అలాగే చిత్రరంగంలో రాక్షసుడుతో మంచి అభిరుచిగల నిర్మాతగా పేరుపొందారు. ఖిలాడి సినిమా భారీ అంచనాలతో రాబోతోంది. రవితేజ కష్టం నాకు తెలుసు. అదే అగ్రస్థానంలో నిలిపింది. క్రాక్ సినిమా కరోనా టైంలో ఎంత ఎనర్జీ ఇచ్చాడో ఇప్పుడు ఖిలాడి కూడా సినిమా రంగానికి జోష్ ఇవ్వబోతున్నారని తెలిపారు.
అనసూయ మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించడం లక్కీగా ఫీలవుతున్నా. నా పదవ సినిమా ఖిలాడిలో చేయడం ఆనందంగా వుంది. చాలా మెమొరీస్ ఈ సినిమాకు వున్నాయి. రవితేజ గారు అప్పటికీ ఇప్పటికే ఎనర్జీ ఒకేలా వున్నారు. నేను చేసిన చంద్రకళ కేరెక్టర్ అందరికీ నచ్చుతుంది. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
త్రినాథ్ నక్కిన మాట్లాడుతూ, నేను ఏ కథ రాసుకున్నా రవితేజ ను బేస్ చేసుకుని చెప్పేవాడిని. క్రాక్ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఖిలాడి డబుల్ ధమాకాగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. ఆయన సినిమా టైటిల్స్ భిన్నమైనవి వుంటున్నాయి. ఆయనతో సినిమా చేయడం ఆనందంగా వుంది. ఇక. దేవీశ్రీ సంగీతం ప్రపంచాన్ని కదిపింది. నిర్మాత కోనేరు సత్యానారాయణగారు అన్ని రంగాల్లో సక్సెస్ అయినట్లే సినిమాల్లోనూ అవుతున్నారని తెలిపారు.
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, రవితేజ వంటి స్టార్ పక్కన నటించడం గొప్పగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. దేవీశ్రీ మ్యూజిక్ బాగుంది.
డింపుల్ హయాతీ మాట్లాడుతూ, ఫుల్‌ఫ్టెడ్జ్‌గా ఖిలాడితో రాబోతున్నాను. నా ఫేవరేట్ హీరో రవితేజ. చాలాకాలం నుంచి ఇలాంటి సినిమా కోసం ఎదురుచూశా. రవితేజగారి మాటల్లో చాలా తెలుసుకున్నాను. హీరోయిన్లకు ప్రాధాన్యత వున్న సినిమా. డి.ఎస్.పి. మ్యూజిక్‌తో నాకు మంచి పేరు వస్తుంది. మూడు పాటలు చేశాను.నేను చేసిన ఇష్టం. ఫుల్ కిక్, కేచ్.. పాటలు డిఫరెంట్‌గా వుంటాయి. ఈ సినిమాలో శాన్వి అనే పాప కూడా నటించింది. ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
రచయిత సాగర్ మాట్లాడుతూ, రవితేజ ఫ్యాన్‌ను. మీ సినిమాలకు కొన్ని పాటలు పాడాను. నేను రాసిన మాటలకు మీరు చెబుతుంటే కిక్ గా వుంది. నాచేత పాటపాడించిన అన్నయ్య డి.ఎస్.పి. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 11న అందరూ చూడండి అని తెలిపారు.
నిర్మాతగా గర్వపడుతున్నా
నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ, పోస్ట్ ప్రొడక్షన్ దర్శకుడు రమేష్ వర్మ రాత్రి పగలు తేడా లేకుండా పూర్తి చేశారు. అందుకే ఈనెల 11న రాబోతున్నాం. ఈ ఫంక్షన్‌కు చిరంజీవి, బాలకృష్ణను పిలిచాం. అనుకోకుండా ఫంక్షన్ చేయడంతో వారు డేట్స్ కుదరలేదు. ఈ సినిమా 130 రోజులు చేశాం. రవితేజ రెండు సినిమాల పని చేశారు. ఏరోజూ డేట్ విషయంలో మమ్మల్ని క్వచ్చన్ చేయలేదు. సినిమా బాగా రావాలనే తపన ఆయనది.రవితేజగారు షూట్‌లో వుంటే హ్యీపీ ఎనర్జీ వుంటుంది. ఈసారి మరోసినిమా చేస్తానని కూడా చెప్పాను. నేను కాలేజీ రోజుల్లో సంగీతం అంటే ఇష్టం. తర్వాత నేను నా వృత్తిలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు సినిమా రంగంలోకి వచ్చాను. నా అబ్బాయి హవీష్ ఈ రంగంపై ఆసక్తి చూపడంతో వచ్చాను.
ఖిలాడి టైటిల్ రవితేజకే యాప్ట్. కథ చెప్పినవెంటనే మాకు ఓకే చేసేశారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ. ఇప్పటికే హిందీలో ఆయనకు ఫ్యాన్స్ వున్నారు. తెలుగులోపాతు బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేస్తున్నాం. దేవీశ్రీ సంగీతానికి మిలియన్ వ్యూస్ వచ్చేశాయి. దాంతో పబ్లిక్‌లోకి సినిమా నానిపోయింది. ఈ సినిమా చూశాక అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. వందరూపాయలతో టికెట్ కొంటే 500 రూపాయల విలువచేసే ఔట్‌పుట్ ఇస్తున్నాం.ఇందులో రవితేజ స్టయిలిష్‌గా వుంటారు. ఈ సినిమా తీసినందుకు నిర్మాతగా గర్వపడుతున్నాను. తెలిపారు.
రచయిత శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ, రవితేజతో పనిచేయడం చాలా హ్యాపీగా వుంది. పేకాటలో నలుగురు కింగ్స్ వుంటారు. ఇందులో రవితేజ ఒక్కరే కింగ్ అంటూ పేర్కొన్నారు.
రామ్ లక్ష్మణ్‌లు మాట్లాడుతూ, తెలుగు సినిమా టీజర్ వస్తుందంటే అన్ని భాషలవారికి ఆసక్తి వుంది. జీవితంలో ఎదిగే క్రమంలో పాజిటివ్, నెగెటివ్ కూడా ఖిలాడి టైటిల్ ఉపయోగకపడేలా దర్శకుడు టైటిల్ పెట్టారు.మనం లక్ష్యం చేరాలంటే కొన్ని వదులకోవాలి. అందుకు రవితేజ నిదర్శనం. కష్టపడి సాధించుకున్నారు. రమేష్ వర్మ చేసిన రైడ్ లో మాకు అవార్డు వచ్చింది. క్లయిమాక్స్‌లో అర్జున్, రవితేజ మధ్య వార్ అద్భుతంగా వచ్చింది. ఇక దేవీశ్రీ మ్యూజిక్‌ను పేషెంట్లు కూడా విని ఆనందిస్తున్నారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ, రవితేజను నా\లుగు సినిమాల నాలుగుచోట్ల కలిశాను. రవితేజగారు మాలాంటి ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. ఆయనది సెపరేట్ కాలేజీ. కోనేరు గారు డిసిప్లెన్ గల వ్యక్తి. దేవీశ్రీ ప్రసాద్ ఆర్య నుంచి సిక్సర్లు కొడుతూనే వున్నాడని తెలిపారు.