రేపు అనగా 10.02.2022 వ తేది నాడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘలచే కలక్టరేట్ ల ముట్టడి మరియు ధర్నా కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు లేవు అని ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ కె వి మోహన్ రావు ఐపీఎస్ వారు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి అధ్వర్యంలో రేపు అనగా (గురువారం) 10.02.2022 విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు తల పెట్టిన ర్యాలీ మరియు కలక్టరేట్ ముట్టడికి ఏలూరు రేంజ్ వ్యాప్తంగా వివిధ విద్యార్ధి సంఘాలచే నిర్వహించ తలపెట్టిన ధర్నా కార్యక్రమాలకు పోలీస్ వారి నుండి ఎటువంటి అనుమతులు లేవు
విద్యార్ధులను అనుమతి లేని ధర్నా కార్యక్రమాలలో పాల్గొనకుండా కాలేజీ, విధ్యా సంస్థల హాస్టల్ ట్రైనింగ్ సెంటర్ యాజమాన్యాలు మరియు తల్లితండ్రులు విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించి వారి యొక్క భవిష్యత్తుకు కలిగే అనర్థాలను గురించి తెలియజేయాలని*
ఏలూరు రేంజి పరిధిలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం అర్బన్, పశ్చిమ గోదావరి జిల్లా మరియు కృష్ణ జిల్లాల విద్యార్ధులు, విధ్యార్ధి సంఘాలు ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని ఏలూరు రేంజి డి. ఐ.జి హెచ్చరించారు*
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తముగా కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఏలూరు రేంజ్ పరిధిలో కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి ఉదృతంగా ఉన్నందున, ప్రస్తుతం నెలకొన్న శాంతిభద్రతల దృష్ట్యా ఈ కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేనందున నిరుద్యోగ సంఘాల నాయకులను ఈ కార్యక్రమాన్ని నిర్వహించవద్దని, విద్యార్థినీ విద్యార్ధులు, నిరుద్యోగులు హాజరు కావద్దని కోరుచున్నము. అన్ని కాలేజీ, విధ్యా సంస్థల ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ హాస్టల్,ట్రైనింగ్ సెంటర్ ల యొక్క యాజమాన్యాలవారిని మరియు విద్యార్థుల తల్లితండ్రులను తమ విద్యార్థులను, పిల్లలను ఈ కార్యక్రమమునకు హాజరు కాకుండా చూడాలని, ఏలూరు రేంజ్ వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు అమలులో ఉన్నందున విద్యార్దులు గుంపులు గుంపుగా గుమిగుడాటం, ర్యాలీలు ధర్నాలు చేయడం చట్టపరంగా నిషేధమని, అన్ని ప్రాంతాలలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు, చట్టాన్ని అతిక్రమించి అనుమతులు లేని ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొనవద్దని, పోలీస్ ఆంక్షలను ఉల్లంఘించినా వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని, ఇటువంటి కేసులలో విద్యార్థిని విద్యార్థులు ఉంటే విదేశాలకు వెళ్లడానికి పాస్ పోర్ట్ లు మరియు ఉద్యోగ కల్పనలకు ఆటంకాలను ఏర్పడతాయని ఏలూరు రేంజ్ డీఐజీ గారు విద్యార్ధులకు మరియు వారి యొక్క తల్లితండ్రులకు తెలియ చేసినారు