ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా ఆయన వాహనంపై కాల్పులు జరిపారు. అయితే, ఈ కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదు అంతా సురక్షితంగా బయటపడ్డారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సచిన్‌ పండిత్‌ నేరం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీని చంపాలన్న ఉద్దేశంతో కాల్పులు జరిపినట్టు పండిట్ విచారణలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. అసలు తాను ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందనే విషయాలను కూడా నిందితుడు పోలీసులకు వెల్లడించినట్టుగా పోలీసులు తెలిపారు.
తాను పెద్ద రాజకీయ నేతను కావాలనుకున్నాను. కానీ, ఒవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు విని కలత చెందాన్న నిందితుడు అందుకే నా స్నేహితుడు శుభమ్‌తో కలిసి ఒవైసీ హత్య చేసుందుకు ప్లాన్ వేశానన్నారు. ఒవైసీపై కాల్పులు జరిపినప్పుడు కారులో ఆయన వంగిపోయారు దీంతో కాల్పులు కిందకు జరిపినట్టు చెప్పుకొచ్చిన ప్రధాని నిందితుడు సచిన్‌ పండిత్ ఒవైసీకి బుల్లెట్లు తగిలే ఉంటాయని అనుకున్నాను. అందుకే అక్కడి నుంచి పారిపోయానని పోలీసుల విచారణలో వెల్లడించాడు.
ఇక, ఒవైసీపై దాడికి చాలా రోజులు నుంచి ప్లాన్ తయారు చేశానని మరోవైపు ఒవైసీ కదలికలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడినని దాడి చేయడం కోసం గతంలో చాలా సందర్భాల్లో ఒవైసీ సమావేశాలకు కూడా వెళ్లినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఎంఐఎం చీఫ్ మీరట్ నుంచి ఢిల్లీకి వెళతారని తెలిసిందే ఆ విషయం తెలిసిన వెంటనే ముందే టోల్‌గేట్ వద్దకు చేరుకుని మాటు వేశామని ఒవైసీ కారు రాగానే కాల్పులు జరిపినట్టు కూడా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.