జీ 5’ ఓటీటీ ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను అందిస్తోంది. లేటెస్టుగా మరో చిత్రాన్ని’ ఎక్స్‌క్లూజివ్‌గా, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది.

‘మళ్ళీ రావా” వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’.టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ నెల 11న సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రే రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యువహీరోలు నికిల్ సిద్దార్థ,సుశాంత్,అడవి శేష్, విశ్వక్ సేన్, నిర్మాత బన్నీ వాసు, డి.జె టిల్లు దర్శకుడు విమల్ తదితర సినీప్రముఖులు పాల్గోని చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.

విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా ‘మళ్ళీ మొదలైంది’. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ పాటలు  హల్ చల్ చేస్తున్నాయి.సిద్ శ్రీరామ్ పాడిన ‘ఎలోన్ ఎలోన్’కు అద్భుత స్పందన లభించింది. ఈ సినిమాకు చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవో.

జీ5 మార్కెటింగ్ డైరెక్టర్ లాయిడ్ జీవియర్ మాట్లాడుతూ..  జీ5 ఫిలాసఫీ ఒకటే ఫిలింనగర్ నుంచి కాకినాడ వరకు చూసే వండర్ఫుల్  కంటెంట్  ఇస్తున్నాము.ఈ కంటెంట్ వ్యాలంటేన్ డే సందర్భంగా ప్రతి కపుల్ కి మా జీ5 మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఫిబ్రవరి 11 న జీ5 లో రిలీజ్ చేస్తున్నా. సబ్ స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే సబ్ స్క్రైబ్ చేసుకోని చూడగలరని కోరుచున్నాను అన్నారు.

అన్న పూర్ణమ్మ మాట్లాడుతూ.. ఈ జనరేషన్ పిల్లలకు తలకాయ పగలగొట్టుకుని మెంటల్ వచ్చి పిచ్చాసుపత్రి లో  చేరకుండా ఉండేలా లైట్ గా సరదాగా నవ్వుకుంటూ జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అనే ఒక అందమైన కథ .ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది  సినిమా చూసిన తర్వాత వారి సమస్యలను ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు.సినిమా బాగా ఉంది. కడుపారా నవ్వుకోనే కామెడీ ఉంటుంది అన్నారు.

చిత్ర నిర్మాత  రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈడి ఎంటర్టైన్మెంట్స్ లో నిర్మించిన మా ఈ కార్యక్రమానికి చాలా మంది హీరోస్ అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు కీర్తి నాకు ఫస్ట్ డే వచ్చి ఈ కథ చెప్పాడు .కథలో చిన్న సజేషన్స్ చెయ్యమని చెప్పాను..ఈ సినిమాను ఎవరితో చేద్దాం అనుకున్నప్పుడు మాకు సుమంత్ గారు గుర్తుకు రావడంతో తనతో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో తను చాలా బాగా యాక్ట్ చేశాడు. చరణ్ గారు నా మా బిజినెస్ లో రైట్ హ్యాండ్ గా వుంటూ ఈ ఫిల్మ్ బిజినెస్ చూసుకున్నాడు.అనూప్ ఇచ్చిన  మూడు పాటలు  చాలా బాగున్నాయి.హీరోయిన్లు చాలా చక్కగా చేశారు.ఈ నెల 11 న జీ5 లో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు.

చిత్ర దర్శకుడు కీర్తి కుమార్ మాట్లాడుతూ.. ఫస్ట్ లాక్ డౌన్ లో ఈ స్క్రిప్టు సుమంత్ గారికి చెప్పడం జరిగింది. స్క్రిప్ట్ నచ్చి ఈ సినిమా చేయడానికి వచ్చాడు. తర్వాత .సీఈఓ చరణ్ తేజ్ కు కూడా స్టోరీ చెప్పడం జరిగింది.నిర్మాత రాజన్న సినిమా నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫుల్ సపోర్ట్ చేశారు.తను ట్రైలర్ తర్వాత నీ వర్క్ బాగుంది,విజువల్స్ బాగున్నాయి అని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అలాగే మాకు ఏం కావాలంటే అది అందించడం  జరిగింది. ఈ సినిమాను సుమంత్, అన్నపూర్ణమ్మ , పోసాని గారు సుహాసిని,వెన్నెల కిషోర్ గార్లతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది ముగ్గురు గర్ల్స్ మధ్య జరిగే స్టోరీ ఇది.అనూప్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాను 29 డేస్ లో పూర్తి చేసాము .29 డేస్ లో పూర్తి కావడానికి ముఖ్య కారణం సుమంత్ గారు తను తొందరగా రావడం అలాగే నటీనటులు, టెక్నిసిషన్స్ అందరూ బాగా కోపరేట్ చేయడం వల్ల సినిమా కూడా తొందరగా పూర్తి అయ్యింది. బన్నీ వాసు వంశీ గారు వాళ్ళకి నిర్మాతలకు ధన్యవాదాలు డి ఓ పి శివ మంచి అవుట్ పుట్ ఇచ్చారు .ఇంతమంది టాలీవుడ్ హీరోలు  ఈ కార్యక్రమానికి రావడానికి వచ్చినందుకు చాలా సంతోషం ఉందన్నారు.

నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ …నేను ఈ ఫంక్షన్ కి రావడానికి రాజు భయ్యా . గత సిక్స్ మంత్స్ నుంచి  తనతో ట్రావెల్ అవుతున్నాను.నాకు ఈ సినిమా చూయించాడు. చాలా బాగుంది.ఒక పెద్ద కథకు యాక్షన్ సీక్వెన్స్, డాన్స్, సాంగ్స్ పెట్టుకొని సినిమా తీయడం అంత కష్టమైన పని కాదు కానీ.. లైట్ హార్టెడ్ సబ్జెక్ట్ ని తీసుకొని ఓన్లీ స్క్రీన్ ప్లే మీద కథను నడుపుతూ.. తీసుకు రావడం అనేది చాలా కష్టమైన పని.డైరెక్టర్ గారు చాలా నీట్ గా ఫీల్ కలిగేలా సినిమాను తీసుకెళ్లాడు.. అనూప్ మ్యూజిక్ బాగుంది ఈ సినిమా చూసిన కపుల్ చాలామంది కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను.చాలా మంది ఇళ్లలో జరిగే సన్నివేశాలు ఇందులో ఉంటాయి. వారందరూ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. హీరోయిన్స్ చాలా చక్కగా చేశారు.సుమంత్ గారికి ఆల్ ద బెస్ట్ .అలాగే ఈ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ కి  మంచి సక్సెస్ రావాలని కోరుతున్నాను.

డిజే టిల్లు డైరెక్టర్ విమల్ మాట్లాడుతూ ..ట్రైలర్ చాలా బాగుంది అనూప్ గారు మ్యూజిక్ కి నేను బిగ్ ఫ్యాన్
ఫిబ్రవరి 11 న జీ5  లో విడుదలైన తరువాత రోజు మా డి.జె.టిల్లు  సినిమా థియేటర్స్ లలో విడుదల అవుతుంది. ఈ  రెండు సినిమాలను ప్రేక్షకులు ఆఫరించాలని ఆశిస్తున్నాను  అన్నారు.

హీరో సుమంత్ మాట్లాడుతూ.. కథ చెప్పేటప్పుడు విడాకులు గురించి చెప్పడంతో ఈ కథ నాకు నచ్చడంతో ఈ సబ్జెక్ట్ చేద్దాం అనుకున్నాము.అనూప్  మంచి పాటలు ఇచ్చాడు. ప్రేమకథ దగ్గర్నుంచి నా ప్రతి సినిమాకు ఒక సిగ్నేచర్ సాంగ్ ఉంటుంది ఈ సినిమాలో కూడా  ఆలోన్. ఆలోన్ అనే పాట కూడా సిగ్నేచర్ సాంగ్ అవుతుంది.  ఫిబ్రవరి11న జి5 లో మీ ముందుకు రాబోతుంది ఈ సినిమా ను సబ్స్ క్రైబ్ చేసుకొని చూడండి అన్నారు.

హీరో నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఈ కథ నాకు ముందే తెలుసు..ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. రాజన్న, సీఈవో తేజ్ ఉప్పలపాటి .వీరు మంచి క్వాలిటీ  ఉన్న సినిమాలు తీస్తారు.వీరు ఇలాగే అనేక మంచి సినిమాలు తీయాలని అన్నారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ..అందరికీ రీచ్ అయ్యే కాన్సెప్ట్ తో సెన్సిటివ్ సబ్జెక్ట్ తీసుకొని వస్తున్నారు. రాజశేఖర్ గారికి సుమంత్ కి హీరోయిన్లకి అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

హీరో అడవి శేషు మాట్లాడుతూ .నాకు టైటిల్స్ చూసి ఇంప్రెస్స్ అవుతాను.. నాకు ఇష్టమైన లవ్ స్టోరీ “మళ్లీ రావా” ఆ సినిమాలు చాలాసార్లు చూశాను “మళ్లీ రావా ” హిట్ తో మళ్లీ అనేది జోడించి “మళ్ళీ మొదలైంది” టైటిల్ తో వచ్చాడు నాకు ఈ టైటిల్ కూడా కనెక్ట్ అయ్యింది ట్రైలర్ బాగుంది. ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు.ఈ సినిమా సుమంత్ కు మంచి విజయం సాదించాలని కోరుతున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. ప్రతి లైఫ్ లో రిలేట్ అయ్యే స్టోరీ ఇది.చాలా న్యాచురల్ గా చేశారు.ఇందులో ఉన్న ఆలోన్ ఆలోన్ అనే సాంగ్ నా హార్ట్ కు టచ్ అయ్యింది.ఈ సాంగ్ సినిమాలో క్రూసేల్ స్టేజ్ లో వస్తుంది. సుమంత్ గారు చాలా బాగా చేశాడు.రాజన్నకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.
రాజన

హీరో సుశాంత్ మాట్లాడుతూ.. ప్రతి టీజర్,ట్రైలర్ కాన్సెప్ట్ బేస్డ్ ఉంది.ఈ సినిమా నుండి చాలా నేర్చుకోవచ్చు.ఈ కాన్సెప్ట్ తెలుగులో ఎవరూ టచ్ చేయలేదు.ఈ సినిమా నాకు కూడా చూడాలని పిస్తుంది.ఈ నెల 11 న జీ5 లో వస్తున్న ఈ సినిమాను చూసి మంచి హిట్ చేయాలని అన్నారు.