ముంబైలో ప్రారంభమైన విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, కరణ్ జోహర్, ఛార్మీ ప్యాన్ ఇండియా మూవీ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) చివరి షెడ్యుల్

ప్యాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) సినిమా షూటింగ్ పూర్తికావొస్తుంది. ఈ మూవీ షూటింగ్, చివరి షెడ్యూల్ నేడు ముంబైలో ప్రారంభమైంది. విజయ్ దేవరకొండతో పాటు మిగిలిన ముఖ్య తారాగణం అంతా కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ చివరి షెడ్యూల్‌తో సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి కానున్నాయి.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన హీరోలను ఎంత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండను సరికొత్త అవతారంతో లైగర్ సినిమాలో చూపించనున్నారు. లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ బీస్ట్ లుక్‌లోకి మారిపోయారు.

కొత్త ఏడాది సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీక్వెన్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. చాయ్ వాలా, స్లమ్ డాగ్స్ ఆఫ్ ముంబై కష్టాలను కూడా అందులో చూపించారు.

బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా లైగర్ నిలవబోతోంది. ఇందులో లెజెండ్ మైక్ టైసన్ ముఖ్య పాత్రను పోషించారు. రియల్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరపై చూసేందుకు సినీ ప్రేమికులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు.

థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్  చేస్తున్నారు. విష్ణు శర్మ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపొందిస్తున్నారు.

లైగర్ చిత్రం ఆగస్ట్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.

నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక బృందం

దర్శకుడు :  పూరి జగన్నాథ్
నిర్మాతలు :  పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్ :  పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్ : విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్ : జానీ షేక్ బాషా
ఎడిటర్ : జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్  : కెచ్చా