గత సంవత్సరం నవంబర్ 21 రాత్రి మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూపకుంట రోడ్డులో జరిగిన హత్యకు సంబందించి బాధ్యులైన ఆరుగురు నిందితులను మీల్స్ కాలనీ పోలీసులు గురువారం అరెస్టు చేసారు.
నిందితుల నుండి హతుడికి సంబంధించిన ఒక బంగారు బ్రాస్లెట్, రెండు బంగారు ఉంగాలు ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. బైరి గురుమూర్తి, తండ్రి పేరు వెంకటస్వామి, వయస్సు 49,రంగశాయిపేట,వరంగల్. 2.నీలం శ్రీనివాస్, తండ్రి పేరు మల్లేషం, వయస్సు 32, శివనగర్, వరంగల్. 3.అకునూరి మహరాజ్ (చనిపోయాడు), తండ్రి పేరు సాంబయ్య, వయస్సు 30, శివనగర్, వరంగల్. 4.గనిపాక నాగరాజు, తండ్రి పేరు బాబు, వయస్సు 33, వసంతాపూర్, వరంగల్. 5. జన్ను కళ్యాణ్, తండ్రి పేరు రమేష్, వయస్సు 21,దూబకుంట, వరంగల్. 6. సింగారపు రాజ్ కుమార్,తండ్రి పేరు సాంబయ్య,వయస్సు 25, వసంతాపూర్, వరంగల్. 7. యం.డి గుంశావలీ ఆలియాస్ గుమ్ము, తండ్రి పేరు పాషా, శంభునిపేట, వరంగల్.
ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ ప్రధాన నిందితుడైన బైరి గురుమూర్తి గతంలో హతుడు కోక వేంకటేశ్వర్ రావుతో కల్సి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహించాడు. ఈ పరిచయంతో ప్రధాన నిందితుడు గురుముర్తి తన పెద్ద కుమార్తె వివాహం కోసం తన స్వంత ఇంటికి సంబంధించిన దస్తావేజులను హతుడు వెంకటేశ్వర్లరావు వద్ద తనాఖా పెట్టి 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకోవడంతో పాటు, నిందితుడి మరిన్ని అప్పులు కావడంతో పాటు, రెండ కుమార్తెకు కాలేజీ ఫీజులు చెల్లించాల్సి వుండటంతో పాటు వివాహం చేయాలని నిర్ణయించుకున్న నిందితుడు తన స్వంత ఇంటిని 58 లక్షలకు అమ్మేందుకు ఒక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు 15 లక్షల రూపాయలను అడ్వాస్సుగా తీసుకోవడం జరిగింది. ఇందుకుగాను నిందితుడు గురుముర్తి తన ఇంటి దస్తావేజుల కోసం హతుడు వేంకటేశ్వర్ రావు సంప్రదించగా తీసుకున్న డబ్బుకు మొత్తం వడ్డీ చెల్లిస్తేనే దస్తావేజులు తిరిగి ఇస్తానని నిందితుడుని ఇబ్బందుకు గురిచేయడంతో హతుడిపై ద్వేషం పెంచుకున్నాడు నిందితుడు. ఇది ఇలా వుండగా హతుడు వేంకటేశ్వర్ రావు ఇంటిలో కిరాయి వుంటున్న మరో నిందితుడు నీలం శ్రీనివాస్ కు వేంకటేశ్వర్ రావు మధ్య ఆర్థిక లావాదేవిల గొడవ కారణంగా నిందితుడు నీలం శ్రీనివాస్ కు సంబంధించిన ఇంటి సామాను వెంకటేశ్వర్లు తన ఇంటిలో వుంచుకోని తాళం వేసుకోవడంతో, నిందితుడు నీలం శ్రీనివాస్ భార్య పుట్టింటికి పోవడంతో నీలం శ్రీనివాస్ సైతం వెంకటేశ్వర్లరావుపై ద్వేషం పెంచుకున్నాడు. ఇదే సమయంలో ప్రధాన నిందితుడు గురుమూర్తి, మరోనిందితుడు నీలం శ్రీనివాస కు మద్య పరిచయం కావడం జరిగింది. ఇరువురు వెంకటేశ్వర్లరావుతో వున్న ఆర్థిక లావాదేవిలకు సంబంధించి గోడవలు వుండటంతో వెంకటేశ్వర్ల రావును నీలం శ్రీనివాస్ ముందుగా మరో నిందితుడు ఆకునూరి మహరాజ్ (చనిపోయాడు)తో బెదించాలని చూసాడు. కాని హతుడు వేంకటేశ్వర్లరావుని చంపడం ద్వారా మన ఇరువురికి అతనితో వున్న ఆర్థిక లావాదేవిలు పూర్తిగా సమసిపోతాయని ప్రధాన నిందితుడు గురిమూర్తి తెలపడంతో ఇందుకు అంగీకరించిన శ్రీనివాస్, వేంకటేశ్వర్ రావు హత్య చేసేందుకు అవసరమైన డబ్బును నేను ఖర్చు చేస్తానని అంగీకరించాడు నిందితుడు గురుముర్తి. హతుడు వేంకటేశ్వర్ రావును హత్య చేసేందుకుగాను నిందితుడు ఆకునూరి మహరాజ్ ద్వారా మిగితా నిందితులతో గురుమూర్తి, శ్రీనివాస్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. హత్యలో భాగంగానే ఫైనాన్స్ చేసిన డబ్బులు రోజు వారి వసూళ్ళ కోసం దూపకుంట రోడ్డు మార్గానికి – వస్తున్నట్లుగా గుర్తించి హతుడు వేంకటేశ్వర్ రావు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తూర్పుకోటకు వెళ్ళే మార్గంలోని తాటివనంలో హత్య చేయాలని నిందితులు నిర్ణయించుకున్నారు. అనుకున్న పథకం ప్రకారం గత నంబర్
21వ తేదీన రాత్రి సుమారు 8గంటల సమయంలో నిందితుల్లో ఒకడైన నీలం శ్రీనివాస్ హతుడు వేంకటేశ్వర్ రావు ద్విచక్ర వాహనంపై ఎక్కి తూర్పుకోట మార్గంలోని తాటి వనం వైపు మభ్యపెట్టి తీసుకరాగా, అప్పటికే – అక్కడ ఆటోలో కాపుకాస్తున్న ప్రధాన నిందితుడు గురుమూర్తితో సహ మిగితా నిందితులు ద్విచక్రవాహనం __ నడుపుతున్న హతుడు వేంకటేశ్వర్ రావుపై నిందితులు మీదపడి పిడిగుద్దుటంతో పాటు, నిందితుల్లో ఒకడైన గనిపాక నాగరాజు హతుడు వెంకటేశ్వర్ణరావు మెడను తన చేతులో విరవడంతో మృతి చెందిన వెంకటేశ్వర్ల ఒంటిపై వున్న బంగారు ఆభరణాలతో పాటు సెల్ ఫోన్, మృతుడి జేబులో పదివేల రూపాయలను నిందితులు దొపిడీ చేసారు.
హత్య జరిగిన మరుసటి రోజు హతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి సూచనల మేరకు వరంగల్ ఏసిపి గిరికుమార్, మీ కాలనీ – ఇన్ స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్ తమ సిబ్బందితో కల్సి వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించి ఈ హత్యకు పాల్పడిన
అసలైన నిందితులను గుర్తించడం జరిగింది. ఈ రోజు ఉదయం ఆర్థిక లావాదేవీలకు సంబందించి నిందితులందరు చర్చించేందుకుగాను రంగశాయిపేట్ వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ తన సిబ్బందితో వెళ్ళి నిందితులను అదుపులో తీసుకొని విచారించగా చేసిన హత్యను నిందితులు పోలీసుల అంగీకరించారు.
ఈ హత్య కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా రెడ్డి, వరంగల్ ఏసిపి గిరికుమార్, మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్, సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, మీల్స్ కాలనీ ఎస్.ఐ రాజేందర్, ఏ.ఏ.ఓలు ప్రశాంత్, సల్మాన్ పాషా , మీల్స్ కాలనీ,కేయు కానిస్టేబుళ్ళు వీరన్న, మధులను పోలీస్ కమిషనర్ అభినందించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము