బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి అరెస్ట్ కు నిరసనగా,317 జీవో ను సవరించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు శాంతియుతంగా చేస్తున్న జాగరణ దీక్ష భగ్నం చేయడానికి ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేస్తూ లోపలికి చొరబడి, బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య దానికి నిరసనగా వినాయక్ నగర్ డివిజన్ లో వాజపేయి నగర్ లోని వాజపేయి విగ్రహం దగ్గర ప్లాకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
🔸ఈ కార్యక్రమానికి ఉద్దేశించి బిజెపి వినాయక్ నగర్ డివిజన్ నాయకులు మాట్లాడుతూ భారతీయ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు ఆయన కార్యాలయం లో 317 జీవో రద్దు కోసం ప్రజాస్వామికంగా జాగరణ దీక్ష చేస్తుంటే, అరెస్ట్ చేయడం సిగ్గు చేటు.
🔸రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం జారీచేసిన 317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్షను అడ్డుకోవడం, మరియు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం.
🔸మద్యం దుకాణాలు, బార్లకు లేని నిబంధనలు బీజేపీ పార్టీకి మాత్రమేనా ?
🔸డిసెంబర్ 31 న రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల రామారావు నల్గొండ జిల్లా పర్యటన, బహిరంగ సభలకు లేని నిబంధనలు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రజా స్వామికంగా దీక్ష చేస్తుంటే దాడి చేసి అరెస్ట్ చేయడం కేసిఆర్ నియంత పాలనకు నిదర్శనం.
🔸ఈ కార్యక్రమంలో బిజెపి వినాయక్ నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శిలు ఆర్.మణి రత్నం, ఏ.చంద్ర శేఖర్, సాయి సురేష్, జ్యోతిర్మయి, సాయి కిరణ్, రాంప్రసాద్, అజయ్ యాదవ్, కృష్ణ ప్రసాద్, సోమనాథ్ చారి, కృష్ణ, సూర్యకాంత్, చైతన్య, దినకర్ తదితరులు పాల్గొన్నారు.