చిరంజీవి మరోసారి తన దాన గుణం చాటుకున్నారు. ఈసారి ఒకరో ఇద్దరికో కాకుండా, మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్నా అన్ని క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న అందరికి లైఫ్ టైం హెల్త్ కార్డులు ఇష్యూ చేసారు ఇంకా చేస్తున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో వున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యోదా డయాగ్నసిస్ సెంటర్ ద్వారా ఈ కార్డులు ఇష్యూ చేసారు. కరోనా మహమ్మారి వాళ్ళ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి, ఆర్ధికంగా చాలామంది ఛిద్రం అయ్యారు. ఆర్ధికంగా అయితే పరవాలేదు, మల్లి నిలదొక్కుకోవచ్చు కానీ చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను కోల్పోయాం. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కదా, అప్పుడు అనిపించింది ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఇండస్ట్రీ కి ఏమి చెయ్యగలను అని ఆలోచించా. అప్పుడే యోదా డయాగ్నసిస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మన సినిమా ఇండస్ట్రీ లో వున్న కార్మికుల ఆరోగ్యం గురించి ప్రస్తావించటం జరిగింది. యోదా డయాగ్నసిస్ చైర్మన్ కంచర్ల సుధాకర్ వెంటనే నా ఆలోచనని ఆమోదించి ముందుకు వచ్చారు. అయితే కొంతమంది మిత్రులు సభ్యుడు ఒక్కడికే కాకుండా, కుటుంబం లో వున్న రక్త సంభందీకులు అయినా మిగతా సభ్యులని కూడా కలిపితే బాగుంటుంది అని చెప్పారు. వెంటనే మళ్ళీ సుధాకర్ గారితో ప్రస్తావించటం జరిగింది, అయన కూడా వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే దానికి కూడా అంగీకారం తెలిపారు.
ఈ విధంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరంజీవి గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్న అన్ని క్రాఫ్ట్స్ లో వున్న సభ్యుల నాయకులకు ఈ కార్డులను అందచేశారు. ఈ కార్డులో సభ్యుడి మొత్తం డాటా నే కాకుండా మరియు అతని కుటుంబ సభ్యుల డాటా కూడా పొందు పరచటం జరిగింది. ఇది అంత డిజిటల్ ఫార్మాట్ లో చేసారు. దీని కోసం ఒక టీం ని పెట్టి ఒక సాఫ్ట్ వేర్ కూడా డెవలప్ చేసారు. ఇప్పటికే కొన్ని వేల కార్డులు రెడీ అయ్యాయి. ఇంకా మిగతా సభ్యుల డాటా అంత కూడా ఫీడ్ చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా ఏ టెస్ట్ అయినా చేయించుకోవచ్చు, వీళ్ళు 50శాతం మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇంకా కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి తాను కళామతల్లి కి చెందిన వాడినని, అందువల్ల ఆ కళామతల్లి బిడ్డగా తన తమ్ముళ్ళకి, మిగతా సోదర సోదరీమణులకు తాను ఈ పని చేస్తున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ లో ఏ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా, ఆ కళామతల్లి బిడ్డగా నేను వాళ్ళకి నా వాళ్ళ ఆయన సేవ చేస్తున్నాను. ఇది నా ధర్మం మరియు నా బాధ్యత. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడంలో భరోసాగా ఉండాలని నేను చెప్పాలనుకున్నా. నా కళామతల్లి కుంటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న భావనతో, వాళ్ళ కుటుంబసభ్యుడిగా నేను చేస్తున్న పని ఇది, అంతే కానీ ఇది వేరే ఇంకే రకంగా చేస్తున్న పని కాదు అని చెప్పారు చిరంజీవి. ఈ విధంగా మరోసారి తన దాన సేవా గుణం చాటుకున్నారు చిరంజీవి.