ఆది సాయి కుమార్ ‘అతిధి దేవో భవ’ జనవరి 7న వచ్చేస్తున్నాడు
ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అతిధి దేవో భవ’. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మించారు. పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సినిమా నుండి మొదటిపాటగా ఓ ప్రేమ గీతాన్ని విడుదలచేశారు. ఆ పాట సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. ఆదివారంనాడు ‘అతిధి దేవో భవ’ చిత్ర విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర యూనిట్ ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
ముందుగా ఈ చిత్రంలోని చూపించిన పాటలు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సిద్‌శ్రీరామ్ పాడిన పాట ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ మరింత అలరించింది.
అనంతరం ఆది సాయికుమార్ మాట్లాడుతూ, జనవరి 7న మా సినిమా రాబోతుంది. నాకు చాలా ఎగ్జయిట్‌గా వుంది. మంచి సినిమాకు మంచి స్పాన్ వున్న సినిమా. కొత్తగా వుంటుంది. పాత్రలన్నీ చాలా భిన్నంగా వుంటాయి. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చింది. శేఖర్ చంద్ర చక్కటి బాణీలు సమకూర్చారు. సినిమా బాగా వచ్చింది. తప్పకుండా థియేర్‌కు వచ్చిఆశీర్వదించండి. డిసెంబర్ లో అఖండ చిత్రం నుంచి పరిశ్రమలో జోష్ మొదలైంది. మంచి సినిమాలకు ఆదరణ ఎప్పుడూ వుంటుందని ప్రేక్షకులు నిరూపించారని` తెలిపారు.
చిత్ర దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ తెలుపుతూ, ఇప్పటికే మా అతిధి దేవో భవ సినిమాలోని పాటలు ఆదరణ పొందాయి. ట్రైలర్‌కు బాగా రెస్సాన్స్ వచ్చింది. ఆది కెరీర్‌లోనే భిన్నమైన జోనర్ ఇది. జనరి 7న విడుదల కాబోతున్న మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నిర్మాతలకు, హీరోకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. త్వరలో ప్రిరీలీజ్‌లో మరిన్ని వివరాలు మాట్లాడుకుందా అని చెప్పారు.
నిర్మాతలు రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల మాట్లాడుతూ, ఆది సాయికుమార్‌ను భిన్నమైన కోణంలో ఈ సినిమాలో చూస్తారు. అందరి సహకారంతో చిత్రాన్ని అనుకున్నట్లు పూర్తిచేశాం. త్వరలో ప్రీరిలీజ్‌లో కలుద్దాం అని చెప్పారు.
సాంకేతిక బృందం: దర్శకత్వం: పొలిమేర నాగేశ్వర్, నిర్మాతలు : రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల, బ్యానర్ : శ్రీనివాస సినీ క్రియేషన్స్, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరామెన్: అమరనాథ్ బొమ్మిరెడ్డి,
ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్