వరుస సినిమాలతో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు దూసుకుపోతున్నారు. ఇటీవలే క్యాలీ ఫ్లవర్ సినిమా విడుదలై ప్రేక్షకులను నవ్వులతో పులకరించేలా చేసింది. ఇప్పుడు తాజాగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా “Mr బెగ్గర్” సినిమా షూటింగ్ ప్రారంభం త్వరలో కానుంది. కార్తీక్ మూవీస్ పతాకంపై వడ్ల జనార్దన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు గురురాజ్, కార్తిక్ వడ్ల నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ ఫణీంద్ర వర్మ అల్లూరి. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్.