కేసీఆర్ ప్రకటన పై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులని మోసం చేస్తున్నాయి – ఎంపీ కోమటిరెడ్డి
కేసీఆర్ రైతులకోసం జంతర్ మంతర్ దగ్గర ఆమరన నిరహర దీక్షకు నేను సిద్ధం నువ్వు సిద్ధమా..?

కేసీఆర్ యాసనగి లో వడ్లను కొనను అని ప్రకటించటం పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు..

కేంద్రం పేరు చెప్పి వడ్లను కొనను అని చెప్పటం దారుణం

కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి..

మీకు చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయి

కేసీఆర్ రేపు ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయి నేను పాల్గొంటాను

తెలంగాణ కోసం చవునోట్లో తల పెట్టి వచ్చాను అని చేప్పుకుంటావు కదా కేంద్రం పై ఎందుకు పోరాటం చేస్తలేవు

తెలంగాణ అంటేనే పోరాటం మనం ఇలా చేతులెత్తేయొద్దు ఉత్తరాద్రి రైతులు లాగా పోరాటం చేద్దాం

మూసి ప్రవహిత మరియు సాగర్ ప్రాంతాలలో వరి తప్ప ఇంకేం పంటలు పండవు వారి పరిస్థితి ఏంటి..?

మీ ఇష్టానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేస్తే రైతుల పరిస్థితి ఎం కావాలి..?

మీ ప్రకటనలతో రైతులు రోడ్లపైన పడతారు ఎట్టి పరిస్థితుల్లో వడ్లు కొనాల్సిందే

5 లక్షల కోట్ల అప్పులు చేశావు రైతులకోసం 20 వేల కోట్లు కేటాయించలేవ..?

రాష్ట్రంలో 50 శాతం భూముల్లో వరి తప్ప ఇంకేం పండవు అని నీకు తెలుసు

తెలంగాణ లో కౌలురైతుల పరిస్థితి ఏంటి..?

తెలంగాణలో రైతులు రోడ్లపైనే పడే పరిస్థితి కనిపిస్తుంటే కేసీఆర్ ఏమో రైతులు పక్క రాష్ట్రాలలో భూములు కొంటున్నారు అని అంటున్నాడు

రైతుల సమస్యల పై కేసీఆర్ కి కనీస అవగాహన లేదు

కేసీఆర్ కేంద్రం పై నెట్టి వడ్లు కొనకుంటే ఊరుకునేది లేదు కొనాల్సిందే

కేసీఆర్ నికు చేతకాకపోతే రాజీనామా చేయి మేము కేంద్రం తో పోరాడతాము రైతులకు న్యాయం చేస్తాం…..