సింగిల్ జడ్జి తీర్పును సమర్థించిన సుప్రీం
కౌన్సెలింగ్ పేరిట వ్యక్తులను పోలీస్ స్టేషన్కు పిలిపించడం, అక్రమంగా నిర్బంధించడం అర్నేత్కుమార్ కేసులో తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కేసు నమోదైనా, కాకపోయినా సంబంధిత వ్యక్తులకు ముందుగా సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) కింద నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు ధిక్కరణ అప్పీల్లో సింగిల్ జడ్జి తీర్పును రద్దుచేస్తూ ఏపీ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది.

ఈ కేసులో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పోలీస్ స్టేషన్ ఎస్ఏహెచ్ అశోకక్కుమార్కు సింగిల్ జడ్జి విధించిన 3 నెలల జైలు శిక్షను 15 రోజులకు కుదిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ బి.త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది.