జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

వీటివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా వందల కోట్ల నిధులు ఆదా అవుతున్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఘనత అంతా మున్సిపల్‌శాఖ బృందానిదేనని కొనియాడారు. గచ్చిబౌలిలోని పురాతన భావిని పునరుద్ధరించి పూర్వ స్థితికి తీసుకొచ్చిన అధికారులను కేటీఆర్‌ అభినందించారు. వెల్‌ డన్‌ అంటూ మూన్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌, చిరేక్‌ స్కూల్‌, రెయిన్‌ వాటర్‌ సంస్థను, కల్పన రమేశ్‌ను ట్విట్టర్‌లో అభినందించారు. గచ్చిబౌలిలోని పురాతన భావిని చిరేక్‌ స్కూల్‌, రెయిన్‌ వాటర్‌ సంస్థ సహకారంతో పునరుద్ధరించినట్టు అరవింద్‌కుమార్‌ ట్విట్టర్‌లో తెలిపారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద మరికొన్ని స్కూల్స్‌ ముందుకురావాలని పిలుపునిచ్చారు.