యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్  హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్  అనుభవించు రాజా. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి మీడియాతో ముచ్చటించారు.

పూరి జగన్నాథ్ స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. 2016లోనే ఓ రెండు సినిమాలు తెరకెక్కించాను. కానీ అవి అంతగా ఆడలేదు. ఆ తరువాత మళ్లీ ఓ కథ రాసుకున్నాను. అలా అన్నపూర్ణ స్టూడియోలోకి వెళ్లాను. సినిమా మొదలైంది. క్రాక్ సినిమాకు రైటర్‌గా పని చేశాను. బాలకృష్ణ గారితో చేయబోతోన్న సినిమాలోనూ రైటర్‌గా పని చేస్తున్నాను.

ప్రతీ మనషిలోనూ ఓ అనుభవించు రాజా ఉంటాడు. డబ్బు, అమ్మాయిలు, సినిమా ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్లో ఇష్టం ఉంటుంది. లైఫ్ చాలా చిన్నది.. ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలనేది ఈ స్టోరీ. నిజంగా అనుభవించడం ఏంటి? అనేది చెప్పే ఎమోషనే ఈ సినిమా.

అన్నపూర్ణ స్టూడియో‌లోకి ఎంట్రీ అవ్వడానికి ఎంతో కష్టపడతాం. కానీ ఇప్పుడు అన్నపూర్ణ బ్యానర్‌లోనే దర్శకుడిగా చేస్తున్నాను. కథ, విలేజ్ సెటప్, ఎండింగ్‌లోని ఎమోషన్ చెప్పాను. అది బాగా నచ్చింది. సుప్రియ గారు ఓకే అన్నారు. చైతన్య గారు, నాగార్జున కూడా విన్నారు. వాళ్లకి కూడా నచ్చడంతో సినిమా మొదలైంది..

నా మొదటి సినిమా కూడా ఆయనే సంగీత దర్శకుడు. నా కోసం ఈ సినిమా చేశారు. ఎంతిస్తే అంత తీసుకున్నారు.

సెక్యూరిటీ గార్డ్ నేపథ్యంలో చెప్పడం రాజ్ తరుణ్‌కి కూడా నచ్చింది. ఇంత వరకు చెప్పని బ్యాక్ గ్రౌండ్. ఒరిజినల్‌గా సెక్యూరిటీ క్యాంప్‌కు వెళ్లి అక్కడే షూటింగ్ చేశాం. భీమవరంలో ఓ నలభై రోజులు షూటింగ్ చేశాం.

కర్లీ హెయిర్ అనే ట్రాక్ ఉంటుంది. అందుకే కశిష్ ఖాన్‌ను తీసుకున్నాం.

ఇండస్ట్రీ చాలా నేర్పించింది. సినిమాలు చాలా నేర్పించాయి. నా బలం ఎంటర్టైన్మెంట్. నేను ఎంతలా పని చేశానో.. సుప్రియ గారు కూడా అంతే పని చేశారు. సిస్టర్, గురువులా నాకు ఎన్నో సలహాలు ఇచ్చారు.

నవంబర్ 26 నుంచే సంక్రాంతి మొదలవుతుంది.

అజయ్, నరేన్, అరియానా, రవికృష్ణ ఇలా చాలా మంచి పాత్రలున్నాయి. నరేన్ గారిని ఫ్రెష్ నెస్ కోసం తీసుకున్నారు.

ఈ సినిమాను నాగ చైతన్య చూశారు. ఆయన మెచ్చుకున్నారు.

నేను అనుకున్న సినిమాను తెరకెక్కించాను. ఎక్కడా కూడా ఎక్కువ మార్పులు చేర్పులు సూచించలేదు. నాకు హెల్ప్ అయిన మార్పులే చేశాను.

మంచి బ్యానర్‌లో ఓ సినిమా ఓకే అయింది. ఆ విషయాన్ని వారు ప్రకటిస్తే బాగుంటుంది.

భీమ వరం నుంచే అనుభవించు రాజా కారెక్టర్ మొదలవుతుంది. కోడి పందెల నుంచే అనుభవించు రాజా సినిమా మొదలవుతుంది. కోడి పుంజులో కలర్ ఏంటి? రకాలు ఏంటి? ఏ కోడి పుంజు ఎప్పుడు పందెమాడుతుంది అవన్నీరీసెర్చ్ చేశాను. ప్రతీ ఏడాది కోడి పందెలకు వెళ్తాను.

పూరి జగన్నాథ్ ప్రభావం నా మీద ఉంది. కానీ ఈ సినిమా మీద ఎలాంటి ప్రభావం లేదు.

ఫ్యామిలీ సినిమా. కామెడీతో పాటు మంచి ఎమోషన్ ఉంటుంది. మనం ఎక్కడుంటే అది మన ఊరు కాదు. మనం పుట్టిందే మన ఊరు అనే ఎమోషన్ ఇందులో ఉంటుంది.

సినిమా మాత్రం ఫ్యామిలీతో పాటు వచ్చి నవ్వుకుని దాంతో పాటు ఓ ఎమోషన్ కూడా తీసుకెళ్తారు. ఇది మాత్రం నమ్మకంగా చెప్పగలను.